చికాగోలో “ఆటా” బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చికాగోలోని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ రంగురంగుపూలతో బతుకమ్మలను తయారు చేసి తమ వెంట తీసుకొచ్చారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో హనుమంత్‌ రెడ్డి, మెహర్‌ మాదవరం, లక్ష్మీ బోయపల్లి, భాను స్వర్గం, వెంకట్‌ తుడి, మహిపాల్‌ వంచ, హరి రైనీ, సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలైన జానపద గాయనీ రాగం శాలినీ ఆలపించిన పాటలు హుషారెత్తించాయి.

డెట్రాయిట్‌లో అమెరికా తెలుగు సంఘం కార్యవర్గ సదస్సు

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) బోర్డు మీటింగ్‌ డెట్రాయిట్‌లోని సౌత్‌ఫీల్డ్ మారియట్‌ హోటల్‌లో జరిగింది. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆటా ట్రస్టీలు, అడ్వైజర్లు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, వివిధ స్టాండింగ్‌ కమిటీ అధ్యక్షులతోపాటూ స్థానిక ఆటా సభ్యలు పాల్గొన్నారు. డెట్రాయిట్‌ ఆటా టీమ్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు హరి లింగాల, మురళి బొమ్మనవేణి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్‌ కోత కాశి, రీజినల్‌ అడ్వైజర్‌ సన్నీ రెడ్డి, సీఎమ్‌ఈ అధ్యక్షులు డా. అశోక్‌ కొండూరు, డా. హర్ష క్రిష్ణ, ఆర్సీలు చెంచురెడ్డి, సునీల్‌ మందుటి, ఎస్‌సీ అధ్యక్షులు వేణు సురపరాజులు ఆటా బోర్డు మీటింగ్‌ పనులను పర్యవేక్షించారు. త్వరలో రాబోయే ట్రస్టీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ కమిటీ, ఎలక్షన్‌ కమిటీల నియామకాలను ఆటా నాయకులు చేపట్టారు. అమెరికాలోని తెలుగువారికి మరిన్ని సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు, మాజీ అధ్యక్షులు హనుమంత్‌ రెడ్డి, ఆటా అధ్యక్షులు కరుణాకర్‌ ఆసిరెడ్డి, ఆటా ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌రెడ్డిలు ఆటా వివాహ పరిచయవేదిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. మాట్రిమోనియల్‌ కమిటీ సభ్యులు శంకర్‌ బండి, రామ క్రిష్ణా రెడ్డి ఆళ్ల, అజయ్‌ రెడ్డి, అనిల్‌ బోడిరెడ్డి, అరుంధతి కోడూరులు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డెట్రాయిల్‌ ఆటా టీమ్‌కు ఆటా బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. లాస్‌ వేగాస్‌లో 2019 జనవరిలో ఆటా మరుసటి బోర్టు మీటింగ్‌ జరగనుంది.

సిలికానాంధ్ర మనబడికి నాటా పురస్కారం

గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35,000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి​ ​ఉత్తర అమెరికా తెలుగు సమితి (​నాటా​)​ ‘విద్యా ప్రదాయని’ పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా ​మెగా కన్వెన్షన్ వేదిక మీద​ నాటా​ అడ్వయిజరీ ​ ​కౌన్సిల్ ఛైర్మన్ ​ప్రేం కుమార్ రెడ్డి​​, ​ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ​తదుపరి ​అధ్యక్షులు​ ​రాఘవ రెడ్డి ​​తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు​ శరత్ వేట ​​ఈ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ​ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు.​ తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను ​గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, నాటా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాల​కు పైగా​ అమెరికా, కెనడా​లతో పాటు 10 ​ఇతర ​దేశాలలో 35​,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష ​నేర్పించామన్నారు. గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని పేర్కొన్నారు. భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందన్నారు. మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, వెబ్‌సైట్‌ http://manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ‘భాషాసేవయే భావితరాల సేవ’ అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారథులుగా తీర్చిదిద్దడానికి ​అహర్నిశలూ కృషి చేస్తుందని​ ​అన్నారు.

ఫిలడెల్ఫీయా “నాటా” సభలో కొట్టుకున్నతెరాస-కాంగ్రెస్ నేతలు

ఫిలడెల్ఫీయాలో జరుగుతున్న నాటా(NATA) పొలిటికల్‌ డిబేట్‌(తెలంగాణ) రసాభాసగా ముగిసింది. తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక పరిస్థితిలో పరిస్థితి చెయ్యి దాటి ఉద్రిక్తంగా మారింది. మంత్రి జగదీశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మధు యాష్కీ, రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత కృష్ణ సాగర్‌, మరికొందరు నేతలు ఈ డిబేట్‌లో పాల్గొన్నారు. అయితే విపక్ష నేతలు టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేసిన క్రమంలో వ్యవహారం కాస్త ముదిరింది. టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు… చర్చాకార్యక్రమంలో ముందుగా మధు యాష్కీ మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్‌ వ్యవహారంపై మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరిట కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వృధా చేస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం?.. మిషన్‌ కాకతీయ భవిష్యత్‌లో మిషన్‌ కల్వకుంట్ల కాకూడదని కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దే. హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయబోమని సోనియా ఆనాడే స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించారు. కానీ, కేసీఆర్‌ ఆ క్రెడిట్‌ మొత్తం లాగేసుకున్నారు.’ అని విమర్శించారు. దీనికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు పస లేనివని.. గాంధీభవన్‌ నుంచి వచ్చే విమర్శలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేత కృష్ణ సాగర్‌ మాట్లాడుతూ… ‘సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికి రావట్లేదు. ఆయన వర్క్ ఫ్రమ్‌ హోమ్ అయ్యారు. అది వర్క్ ఫర్ హోమ్ కూడా’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకానోక టైంలో రేవంత్‌-జగదీశ్‌లు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటంతో డిబేట్‌ వేడెక్కింది. ఈ క్రమంలో తమపైనా దురుసు వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నారైలు ఆందోళనకు దిగారు. దీంతో నిర్వాహకులు పోలీసులను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అమెరికాలో సీతారామ కళ్యాణం

అమెరికాలోని హోస్టన్‌ నగరంలో భద్రాద్రి రాముడి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం కెనడా, సింగపూర్‌, మలేషియా, తదితర దేశాల్లో కూడా కల్యాణం జరగనుందని, ఆటా కో-ఆర్డినేటర్‌, ప్రముఖ నాట్య కళాకారిణి పద్మజారెడ్డి తెలిపారు. సోమవారం లక్డీకాపూల్‌ సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆమె భద్రాచలం ఆలయ అర్చకుడు మదన్‌మోహనాచార్యులు తో కలిసి మాట్లాడారు. అమెరికాలోని హోస్టన్‌ నగరంలో ఈ నెల 29, 30, జూలై 1వ తేదీలో తనతోపాటు శిష్య బృందం నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రసమయి బాలకృష్ణ బృందం కళాకారులు కూడా పాల్గొంటారని తెలిపారు. దాదాపు 10వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమంలో క్లాసికల్‌ నృత్యంతో పాటు నవదుర్గలు అనే అంశంపై ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జూలై 1న భద్రాచలం నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకెళ్లి ఆ ఆలయ అర్చకులతో కల్యాణం జరిపించనున్నట్లు తెలిపారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డితో పాటు పలువురు హాజరవుతారన్నారు. అనంతరం జూలై 8న కెనడాలో తదనంతరం సింగపూర్‌, మలేషియా, తదితర దేశాల్లో ఈ కల్యాణోత్సవం ఉంటుందన్నారు.మదన్‌మోహనాచార్యులు మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యాణం ఇతర దేశాల్లో నిర్వహించడం వల్ల లోకకల్యాణం జరుగుతుందన్నారు. పద్మజారెడ్డి శిష్య బృందం శాలిని, భూమిక, రేణుక, ఆశా, చందన, హర్షిణి పాల్గొన్నారు.

అమెరికాలో రాసలీలల గోల ముగిసింది.ఇక నోళ్లు మూసుకోండి-TNI ప్రత్యేకం

“దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా”…అమెరికాలో జరిగిన సినీతారల రాసలీలల వ్యవహారాన్ని తెలుగు మీడియా భూతద్దంలో చూపిస్తోంది. ఈ విషయంలో అక్కడ ఉన్న తెలుగు సంఘాలకు కానీ వాటి నిర్వాహకులకు గానీ ఏ విధమైన సంబంధం లేనప్పటికీ కొంతమంది వాస్తవాలు వక్రీకరిస్తున్నారు. మరికొంతమంది దురుద్దేశపూర్వకంగా, ఇంకొందరు వ్యక్తిగత కక్షలతోనూ రాసలీలల వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తూ రచ్చ చేస్తున్నారు. కొన్ని ప్రధాన పత్రికలు కూడా తమ బాధ్యతలను విస్మరించి అమెరికా నుండి వాస్తవాలు వక్రీకరించే వారి నుండి సమాచారం తెప్పించుకుని వీటిపై కథనాలు అల్లుతున్నారు. భారతదేశంలోని కొంత మంది సిగ్గుమాలిన, నీతిమాలిన వ్యభిచారిణులు తాము సినిమా నటీమణులమని పేరు చెప్పుకుని అమెరికాలో ఒళ్లు అమ్ముకోవడం, విటులను ఆకర్షించడం గత 20 సంవత్సరాల నుండి అమెరికాలో సర్వసాధారణంగా జరుగుతోంది. కాకపొతే తెలుగు సంఘాల ఉత్సవాలు జరిగేటప్పుడు వీరి హడావుడి కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది మహిళలు కొన్ని తెలుగు సంఘాలు ఇచ్చిన ఆహ్వాన పత్రికలను దుర్వినియోగం చేశారు. వీటిపై పేర్లు మార్చి, వీసాలు పొంది అమెరికాలో ప్రవేశించి తమ వ్యాపారాన్ని గుట్టుగా, కొన్ని చోట్ల బహిరంగంగా సాగిస్తున్నారు. అమెరికాలో ఒక వ్యక్తి తన భార్యకు అన్యాయం చేయకుండా, ఆమె అభ్యంతరం పెట్టనంతవరకు మహిళా స్నేహితులతో గడపడం అక్కడ పెద్ద నేరంగా భావించరు.

*** అమెరికాలో మీడియా ప్రవేశానికి తెలుగు సంఘాలే ఆధారం
అమెరికాలో జరిగిన రాసలీలలపై అభూతకల్పనతో కథనాలు, చర్చాఘోష్టులు నిర్వహిస్తున్న చాలా మీడియా సంస్థలు తెలుగు సంఘాల ద్వారానే అమెరికాలోకి ప్రవేశించారు. తెలుగు మీడియా ప్రతినిధులు చాలా మందిని తెలుగు సంఘాలు ఆహ్వానించి ఆదరించాయి. ఆహ్వానాలు అందించి అమెరికాలో వారి సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆసరా ఇచ్చాయి. కొద్ది నెలల క్రితం న్యూజెర్సీలో తెలుగు సంఘాల అండతో పైకి వచ్చిన ఒక టీవీ ఛానల్ ప్రతినిధి అదే తెలుగు సంఘాలను దుర్భాషలాడుతూ చేసిన ఆడియో టేపు బయటపడింది. అమెరికాకు ఇక్కడి నుండి వెళ్లి వ్యభిచారం చేస్తున్న మహిళల్లో సినీ నటీమణులే కాకుండా కొందరు టీవీ యాంకర్లు కూడా ఉన్నారనేది బహిరంగ రహస్యం. అటువంటిది ఇప్పుడు జరిగిన వ్యవహారంపై అభూత కల్పనలతో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం విచారకరం. అమెరికా అంటే ఏమాత్రం తెలియని వారు కూడా స్థానిక టీవీలలో జరిగే చర్చాఘోష్టుల్లో పాల్గొంటూ కట్టుకథలు వినిపిస్తున్నారు. ఎప్పుడో ఏప్రిల్‌లో జరిగిన మోదుగుమూడీ కిషన్ దంపతుల అరెస్టును సాకుగా చూపి రాసలీలల కథనాలను ప్రత్యేక చర్చలతో రక్తి కట్టిస్తున్నారు.

*** రాసలీలల వ్యవహారం ముగిసినట్లేనా?
TNIకు అందిన సమాచారంతో పాటు అమెరికాలో మాకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో…….ఈ రాసలీలల వ్యవహారం కిషన్ దంపతుల అరెస్టుతోనే ముగిసిపోయింది. అందరూ అంటున్నట్లు అమెరికాలో మన సీబీఐ లాంటి అత్యున్నత సంస్థ ఫెడరల్ బ్యూరో(FBI)కు ఈ కేసుకు ఏ విధమైన సంబంధం లేదు. స్థానికంగా ఉండే హోంల్యాండ్ సెక్యురిటీ అధికారులు ఈ కేసును విచారించి ఛార్జిషీట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో కిషన్ చేతిలో మోసపోయిన మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అక్కడ పోలీసులు దర్యాప్తు జరిపారు. కిషన్ దంపతులను దోషులుగా చేర్చి బొక్కలో వేశారు. ఈ కేసులో ఎవరైనా తలదూర్చి తమను కూడా కిషన్ దంపతులు మోసం చేశారని ఫిర్యాదు చేస్తే దానిపై మాత్రమే దర్యాప్తు జరుగుతుంది లేదా కిషన్ దంపతులు తమను ఫలానా వారు మోసగించారని ఎదురు దాడికి దిగితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ కేసు విచారణ ముగిసినట్లే. సుదీర్ఘ కాలం అయినా కూడా విచారణ కొనసాగుతుందని వచ్చే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.

*** తెలుగు సంఘాలు గుణపాఠంగా తీసుకోవాలి
ఏది ఏమైనప్పటికీ ఇక నుండి తెలుగు సంఘాల నిర్వాహకులు ఈ రాసలీలల వ్యవహారాన్ని గుణపాఠంగా తీసుకోవాలి. కొన్ని తెలుగు సంఘాల మధ్య ఉన్న విభేదాలు కూడా మన తెలుగు జాతి పరువు పోయే విధంగా ఉంటోంది. తెలుగు సంఘాల నిర్వాహకులందరు ఒకే వేదిక పైకి వచ్చి అమెరికాలో తెలుగు జాతి పరువు కాపాడే విధంగా ఒక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాసభలు అంటే సినిమా తారలు ఉంటేనే రక్తి కడతాయి అనే అభిప్రాయం నుంచి బయటకు రావాలి. వ్యక్తిగత ఆరోపణలున్న వివిధ రంగాలకు చెందిన మహిళలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈ సంఘాల మహాసభలు పిలవకుండా ఉండటం చాలా మంచిది. ఇదే సమయంలో తెలుగు సంఘాల నిర్వాహకులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమెరికాలో జరుగుతున్న తెలుగు సంఘాల ఉత్సవాలకు హాజరుకావటం గతంలో ముఖ్యమంత్రులు కూడా గర్వకారణంగా భావించేవారు. కొందరు తెలుగు సంఘాలు నిర్వాహకులు మూలంగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాభై రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరూ అక్కడ ఉన్న సంఘాలకు మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటే ఈ నాయకులు మాత్రం తెలుగు రాష్ట్రాలకు వచ్చి పనికి మాలిన రాజకీయ నాయకుల ముందు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఇది చాలా దారుణం! మీ ప్రతిష్ఠనే కాకుండా అమెరికాలో ఉన్న తెలుగుజాతి పరువును కూడా ఈ నాయకులు తమ చర్యల ద్వారా దిగజార్చుకున్నారు. మీ సొంత ఎజెండాను మీరు ఎన్నికైన తెలుగు సంఘాలతో ముడి పెట్టకుండా ఉండడం మంచిది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేదా మంత్రి పదవి కన్నా తెలుగు సంఘాల్లో మీకున్న పదవే గొప్పదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ – గతంలో “తానా”ను నెలకొల్పిన డా.కాకర్ల సుబ్బారావును అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు బతిమిలాడి రాష్ట్రానికి తీసుకువచ్చారు. మీరు కూడా అటువంటి గుర్తింపునే పొందాలి. ఒక చెడు ఒక మంచి కోసం జరుగుతుంది అంటారు. జరిగిన సంఘటనలు అన్ని మననం చేసుకుంటూ వ్యక్తిగత, కుల, వర్గ పోరాటాలను విస్మరించి రానున్న తెలుగు సంఘాల మహాసభలను జయప్రదం చేయటంపై దృష్టి పెట్టండి. మరలా పూర్వవైభవాన్ని మన తెలుగుజాతికి తీసుకురండి.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

ప్రత్యేక హోదాపై ఫిలడెల్ఫీయాలో చర్చించనున్న వైకాపా

నార్త్ ‌అమెరికన్ ‌తెలుగు అసొసియేషన్‌ మహా సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యకతను చాటి చెపుతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. నాటా సభలు జరగనున్న ఫిలడెల్ఫియాకు జులై 5 కల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బృందం రానుందని పార్టీ గవర్నింగ్ కౌన్సిల్ రమేష్ రెడ్డి వల్లూరు, పార్టీ యూఎస్ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల తెలిపారు. హోదా పోరులో ఏపీలో, ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ఎన్నారైల ముందుంచుతామని, నాలుగేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ ఎలా వెన్నుపోటు పొడిచారో వివరిస్తామని తెలిపారు. మహానేత వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసేవరకు అమెరికా కమిటీ ఆహర్నిశలు కష్టపడుతుందన్నారు. ప్రజలందరికీ మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను నాటా వేదికగా వేలాది మంది ఎన్నారైలకు చాటి చెపుతామన్నారు. జులై 8, 2018 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ సిపి యూఎస్ఏ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ఫోరం సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తమ పార్టీ నుంచి గెలిచిన 23 మందిని చంద్రబాబు ప్రలోభపెట్టి ఏ విధంగా పార్టీ ఫిరాయించేలా చేశారో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వివరిస్తారని తెలిపారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్‌ఇన్‌ఛార్జ్‌లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్‌శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్‌ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్‌అధ్యక్షులు శివభరత్‌రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు.

“బాటా” ఆధ్వర్యంలో క్రీడా పోటీలు


Bay Area Telugu Association (BATA) organized it’s 12th Annual Volleyball Tournament at Newark, California. Proceeds were donated to the “India Literacy Project “(ILP). BATA Committee thanked all the volunteers for their support and efforts in organizing the tournament and ensuring all matches were conducted on time. BATA committee specially thanked all the sponsors for their continued support.

Results of BATA-ILP Volleyball Cup 2018:
ThrowBall:
Silver – Thunders (Runner) & Kickers (Winner)
Gold: Divas (Runner) & Sparks (Winner)

Volleyball Recreation:
Silver – Jaguars (Runner) & Grabbers (Winner)
Gold: Oracle Warriors (Runner) & Dreamers (Winner)

Volleyball Intermediate:
SpiceIt (Runner) & Diamond Club (Winner)

Volleyball Advanced:
Googly (Runners) & Mighty Hitters (Winner)

నాటా సదస్సుకు భారీ ఏర్పాట్లు

నార్త్ అమెరికా తెలుగు అసొషియేషన్ (నాటా) ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరం వేదికగా జులై 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న నాటా మహా సభలకు ఏకంగా 13 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహా వృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నాటా.. తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. నాటా ప్రతి రెండేళ్లకి ఒకసారి కన్వెన్షన్ నిర్వహిస్తుంది. 2016లో డల్లాస్‌లో, ఈ సారి ఫిలడెల్ఫియోలో వేడుకలు నిర్వహిస్తోంది. నాటా సమాజ సేవలో ముందుండడం, పూర్తి పారదర్శకంగా వ్యవహరించడం, తెలుగు వారి అవసరాలు తీర్చేలా ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో అమెరికాలో తలెత్తిన ప్రకృతి విపత్తుల సమయంలోనూ తనవంతు సహాయ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సారి మహాసభలకు వివిధ రంగాల్లో ప్రముఖులు, వేర్వేరు పార్టీల రాజకీయ నాయకులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఇక మహాసభల్లో సాంస్కృతిక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పలువురు సినీ నటులు, దర్శకులు, గాయినీ గాయకులు, రచయితలు, టీవీ ఆర్టిస్టులు నాటా వేడుకల కోసం అమెరికా వస్తున్నారు. మహాసభలకు ముందస్తుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. నాటా నారి పేరుతో మహిళా సదస్సులు, యువత కోసం యూత్ వెల్‌నెస్ కార్యక్రమాలు, అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, యూఎస్‌లోని వేర్వేరు నగరాల్లో ఆర్ట్ కాంపిటీషన్స్ , మ్యాట్రిమోనీ కార్యక్రమాలు నిర్వహించింది. నాటా మాట పేరుతో ఓ పత్రిక కూడా విడుదల చేసింది.

తెలుగు సంఘాలు అందరినీ వాడేసుకున్న అమెరికా సినీ వ్యభిచార నిర్వాహకులు.FBI ఛార్జిషీట్ చూడండి-TNI ప్రత్యేకం.


తెలుగు సినీ నటులతో అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు చిక్కిన కిషన్‌ మోదుగుమూడి దంపతులు పూర్తి ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. తెలుగుసినీ పరిశ్రమకు చెందిన నటీమణులను అమెరికా రప్పించడంతోపాటు.. విటులను ఆకట్టుకునేందుకు వారి ఫొటోలను చరవాణుల ద్వారా పంపిణీ చేసి మరీ వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలపై హోంలాండ్‌ సెక్యూరిటీ ఇన్విస్టిగేషన్‌ స్పెషల్‌ ఏజెంట్‌ బ్రియాన్‌ గిన్‌ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వారిపై ఆరోపణలకు సంబంధించి బ్రియాన్‌ గిన్‌ దాఖలు చేసిన అభియోగపత్రాలను TNI సేకరించింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం ద్వారా కొంత మంది నటీమణులతో పరిచయాలు పెంచుకున్న కిషన్‌.. వ్యభిచారం నిర్వహించేందుకు వారిని అమెరికా రప్పించేవాడు. వీసా ఇప్పించడానికి అమెరికాలోని రకరకాల తెలుగు సంఘాల పేర్లు వాడుకునేవాడు. తమ సంఘం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వారిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొనేవాడు. వీసా మంజూరయిన తర్వాత తన డబ్బుతోనే విమాన టిక్కెట్లు, హోటల్‌ గదులు బుక్‌ చేసేవాడు. priceline.com వెబ్‌సైట్‌ ద్వారా విమాన టిక్కెట్లు బుక్‌ చేసినట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెంటు దర్యాప్తులో తేలింది. 2016 నవంబరు 8వ తేదీ నుంచి 2017 నవంబరు 29వ తేదీ మధ్య 76 విమాన టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు తేలిందని దర్యాప్తు అధికారి అభియోగపత్రంలో పేర్కొన్నారు. తన ఇంటి చిరునామాతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఖాతా ద్వారానే ఈ టిక్కెట్లు కొన్నట్లు, అందులోని చరవాణి నెంబరు కూడా కిషన్‌దే (చివరి నాలుగు సంఖ్యలు 6887)అని, మెయిల్‌ ఐడీ (mkishan3456@gmail.com) కూడా ఆయనదేనని గుర్తించారు. అలానే 2016 నవంబరు 9 నుంచి 2018 జనవరి 3వ తేదీ మధ్యలో అమెరికాలో 42 హోటళ్లలో గదులను కూడా ఇదే ఖాతా ద్వారా బుక్‌ చేసినట్లు వెల్లడయింది. వాటి కోసం మొత్తంగా ఏడాదిలో రూ.కోటి వరకు ఖర్చు చేసినట్టు తేలింది. ‘‘అమెరికాకు వస్తున్న నటీమణులతో సంప్రదింపులకు వాడిన చరవాణి నెంబర్లు, ఈమెయిల్‌ చిరునామాల్లోనూ ఇవే ఉన్నాయి. దీన్నిబట్టి కిషన్‌ మోదుగుమూడి అయన భార్య చంద్రకళ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటులను అమెరికా రప్పించి, వారి ఫొటోలు పంపిణీ చేసి, వారితో వ్యభిచారం నిర్వహించినట్లు అర్థమవుతుందని’ దర్యాప్తు అధికారి అభియోగపత్రంలో వివరించారు. వాళ్లిద్దరూ వ్యభిచారం కోసం నటీమణులను రప్పించే క్రమంలో వీసాలు ఇప్పించేందుకు రకరకాల తెలుగు సంఘాల పేర్లు వాడుకున్నారు. ఇందుకోసం దొంగ పత్రాలను సృష్టించారు. ఉదాహరణకు అభియోగపత్రంలో పేర్కొనట్లుగా బాధితురాలు ‘ఎ’ కోసం.. ‘ఆమె ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) 2017 నవంబరు 25వ తేదీన ఇల్లినాయిస్‌లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు’ లేఖ తయారు చేసి వీసా వచ్చేలా చూశారు. దర్యాపు అధికారి నాట్స్‌ ప్రతినిధులను సంప్రదించినప్పుడు ఆ తేదీలో తాము ఎలాంటి సమావేశం నిర్వహించలేదని, సదరు నటీమణి ఎవరో తమకు తెలియదని వారు వెల్లడించారు. అలానే అక్కడి అనేక తెలుగు సంఘాల పేర్లనూ, వాటి అధికారిక ఉత్తర్వు ప్రతి(లెటర్‌ హెడ్‌)లు కూడా ఫోర్జరీ చేసి కిషన్‌ వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో భాగంగా కిషన్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు ఐదు డైరీలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో విటులు ఎప్పుడెప్పుడు? ఎంత మొత్తం చెల్లించారు? అన్న వివరాలు ఉన్నాయి. ‘అవన్నీ తెలుగులో ఉండటంతో వాటిని తెలుగు-ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్న అధికారులతో తర్జుమా చేయించినట్లు అభియోగపత్రంలో’ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు దర్యాప్తు అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఉదాహరణకు అమెరికా వచ్చిన నటీమణులతో మాట్లాడిన చరవాణి నంబర్లు, వారితో సంప్రదింపులు జరిపేందుకు వాడిన ఈమెయిల్‌ చిరునామా కిషన్‌దేేనని ఆయా సంస్థల నుంచి (సర్వీస్‌ ప్రొవైడర్స్‌) అధికారిక లేఖ తెప్పించారు. విమాన టిక్కెట్లు, హోటల్‌ గదులు బుక్‌ చేయడానికి ఇచ్చిన చిరునామాలోనూ వీటినే వాడినట్లు గుర్తించారు. అలాగే బాధితులను(నటీమణులు) ఎ.బి.సి.డి.ఇ.లుగా పేర్కొన్న దర్యాప్తు అధికారి..వారు వాడిన చరవాణి నెంబర్లనూ సేకరించారు. సంకేతాల ఆధారంగా ఆ నంబరు వినియోగించే చరవాణి ఏరోజు? ఏ సమయంలో చికాగోలోని మోదుగుమూడి ఇంట్లో ఉందో కూడా గుర్తించారు. నటీమణులు, విటులతో సంప్రదింపులు జరిపేందుకు ఈ నెంబర్లు, మెయిల్‌ ఐడీలే వాడినట్లు నిర్ధారించడంతోపాటు.. ఇందుకోసం ఉపయోగించిన అంతర్జాల సదుపాయం కూడా కిషన్‌ పేరుతోనే ఉన్నట్లు తెలుసుకోగలిగారు. కిషన్‌, అతని భార్య చంద్రకళల చరవాణుల నుంచి నటీమణులు, విటులతో జరిపిన చాటింగ్‌ తాలూకూ పూర్తి వివరాలను కూడా సేకరించారు. ‘అందులో నటీమణుల ఫొటోలు విటులకు పంపడం, వారికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో చెప్పడం వంటివి కూడా ఉన్నాయి. దీన్నిబట్టి వ్యభిచారంలో భాగంగానే ఈ సంభాషణ జరిగినట్లు నిర్ధారించడానికి అవకాశం ఉంటుందని’ దర్యాప్తు అధికారుల అభిప్రాయం. ఇదిలా ఉంటే అమెరికా అధికారి దాఖలు చేసిన అభియోగపత్రంలో వ్యభిచారం కోసం రప్పించిన నటీమణుల పేర్లు గోప్యంగా ఉంచారు. వారి పేర్లకు బదులుగా బాధితురాలు ఎ, బాధితురాలు బి ఇలా పేర్కొన్నారు. ఈ ఏబీసీడీఈలు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి ఒకప్పుడు కాస్త గుర్తింపు ఉన్న నటీమణితోపాటు.. తెలుగులో వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయవంతం కాని నటీమణి ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలో తెలుగు సినిమా తారలతో వ్యభిచారం నిర్వహించారన్న అభియోగంపై మోదుగుమూడి దంపతులను అమెరికా పోలీసులు అరెస్టు చేయడం తెలుగు చిత్ర పరిశ్రమని ఉలికిపాటుకు గురిచేసింది. అక్కడ వ్యభిచార దందా నడిపించిన మోదుగుమూడి కిషన్‌కి చిత్ర పరిశ్రమతో సంబంధం లేదని, కిషన్‌ నిర్మాతే కాదని సినిమా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అతని వలలో పడి కొద్దిమంది కథానాయికలు ఇబ్బందులు పడ్డారన్న దిశగానూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రాగానే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) స్పందించింది. ఇకపైన పరిశ్రమకి చెందిన వ్యక్తులకు విదేశాల నుంచి ఆహ్వానం అందితే ఆ విషయాన్ని ‘మా’ దృష్టికి తీసుకురావాలని నటీనటులకి సందేశాలు పంపుతున్నట్టు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ‘ఈనాడు’తో తెలిపారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు జెమినీ కిరణ్‌ మాట్లాడుతూ.. ‘ఇది తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులు చేసిన పని. పరిశ్రమ తరఫున వెళ్లేవాళ్లు మాత్రం ‘మా’కో, చలన చిత్ర వాణిజ్య మండలి దృష్టికో తీసుకువస్తే మేలు’ అని చెప్పారు. చలన చిత్ర వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి ముత్యాల రాందాస్‌, పరిశ్రమ అధికార ప్రతినిధి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘విదేశాలకు వెళ్లే సినిమా వ్యక్తులందరిపైనా పరిశ్రమ నియంత్రణ కష్టతరమే. పరిశ్రమ తరఫున వెళ్లే వాళ్లకు మాత్రం తగిన రక్షణ కల్పించడానికి సాధ్యమవుతుంది. మధ్యవర్తుల ద్వారా వెళ్లడం మాత్రం శ్రేయస్కరం కాదు’ అని తెలిపారు. కిషన్‌ జిమెయిల్‌ వివరాలను దర్యాప్తు అధికారి విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కిషన్‌కు..ఒక విటుడికి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా సదరు విటుడి ఫోన్‌ వివరాలను దర్యాప్తు సంస్థ సేకరించింది. ‘జి’గా పేర్కొన్న ఆ విటుడు తన చరవాణిలో.. కిషన్‌ పేరును ‘చికాగో వెధవ’గా నమోదు చేసి ఉండటం గమనార్హం.

TNILIVE-FBI-CHARGESHEET-KISHANMODDUGUMUDI-TOLLYWOOD-PROSTITUTION-VEBHAJAYAM
tags: usa tollywood prostitution names, tana ata nats tasc tpad ata in tollywood prostitution case chicago atlanta kishan modugumudi vebha jayam vibha jayam chandra kala purnima modugumudi anchor in usa prostitution tollywood actress prostitution in telugu events indian events usa tnilive tni telugu news international fbi case tollywood prostitution usa federabl bureau of investigation tollywood sex scandal in usa nri pimps

“ఆటా-టాటా” చెట్టాపట్టాల్. ప్రవాస సంఘాలకు గట్టిపాఠాల్:TNI ప్రత్యేకం


“కరుణ కురిపించు. హరిని మరిపించు.” ఈ సూత్రం ప్రపంచశాంతికి తారకమంత్రం. ఇప్పుడు ప్రవాస తెలుగు సంఘాల మధ్య నూతన క్రాంతికి కూడా ఇదే సరికొత్త తంత్రం. అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) అధ్యక్షుడు డా.ఆసిరెడ్డి కరుణాకర్, తెలంగాణా అమెరికా తెలుగు సంఘం(టాటా) అధ్యక్షులు డా.హరనాథ్ పొలిచెర్లల సంయుక్త స్నేహసౌరభాల సొగసులో డల్లాస్‌లో నిర్వహించిన అమెరికా తెలుగు మహాసభలు ప్రవాస తెలుగు సంఘాల మధ్య చిగురించవల్సిన సౌహార్ద వాతావరణాన్ని ముంజేతి కంకణంగా ప్రకాశింపజేశాయి. తక్కువలో తక్కువగా కనీసం మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రతి ఏటా మే, జూన్, జులై నెలల్లో అమెరికాలో ఏదో ఒక జాతీయ స్థాయి తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు సభలు సందడిగా జరుగుతుంటాయి. ఆటా-టాటా సభలు కూడా సుమారుగా ఇదే మొత్తాన్ని ఖర్చు చేసినప్పటికీ వారు రచించిన చరిత్ర, సృష్టించిన ఒరవడి ప్రతి జాతీయ స్థాయి తెలుగు సంస్థకు ఓ విలువైన ప్రాథమైక సూత్రం. మా సభలకు వాళ్లు వస్తారు, వాళ్ల సభలకు మేము వెళ్తాం…మీడియా ముదనష్ట గోల కోసం వేదిక మాత్రం పంచుకునే ప్రసక్తే లేదనే చందంగా తయారైన నాయకాగణం ఈ సభల నుండి అయినా “అహము వీడి కలిసి ఉంటే అర్హత పెరిగి కలదు సుఖం” అనే నానుడిని ఒంటబట్టించుకుంటారేమో వేచిచూడాలి. Joint Advisory Coungil(JAC), Joint Executive Committee(JEC) పేరిట ప్రతి బాధ్యతలోనూ సమతుల్యాన్ని పాటించిన నిర్వాహకులు ఎక్కడా పొరపచ్చలకు తావులేకుండా మసులుకోవడం స్నేహానికి తెలుగువారు ఇచ్చే విలువకు నిదర్శనం. Joint అనే పదానికి ఇద్దరితోనో ఆగిపోవాలని ఏ నిఘంటువులోనూ లేదు గనుక అది మూడు, నాలుగు, అయిదు, వందగా కూడా పురోగమించవచ్చు.
2018 dallas american telugu convention ata tata tnilive telugu news international tni tnilive

2016లో డల్లాస్‌లో నిర్వహించిన నాటా సభల్లో ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రేమ్‌సాగరరెడ్డి మాట్లాడుతూ…సమీప భవిష్యత్తులో నాటా, టాటాలు కలిసి తమ అమ్మ “ఆటా” ఒడిలో ఆడుకుంటూ కలిసికట్టుగా ఒకే వేదికను పంచుకుంటామని ప్రకటించిన దరిమిలా ఎన్నో చర్చోపచర్చలు విస్తృతంగా జరిగాయి. ఆఖరి నిముషంలో ఏమి జరిగిందో తెలియదు గానీ అమెరికా తెలుగు మహాసభల నిర్వాహక సంస్థల జాబితా నుండి నుండి నాటా నిష్క్రమించింది. ఈ అంశంపై మొన్న జరిగిన డల్లాస్ ఆటా-టాటా సభల్లో…”హరి కరుణ తమపై కురవడానికి అహంతో కూడుకున్న భక్తిప్రేమలు సరిపోలేదని” పరిసార్లు ప్రేమ్‌రెడ్డి వాపోవడం ఐకమత్యానికి తాను ఎంతటి విలువ ఇస్తున్నానో తెలియజెప్పిన వాస్తవం. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో సరికొత్త శకానికి సంతకం చేసేందుకు తమ కలం కాలంతో కలిసిరాకపోవడం విచారకరం అన్న ఆయన మాటలు స్మరణీయం.


అమెరికా తెలుగు మహాసభల్లో పాలుపంచుకున్న సంస్థలు వాటి స్ఫూర్తి ఎదుట సభల నిర్వహణ, అతిథులు, కార్యక్రమాల్లో నూతనత్వం వంటివి బేజారుగా అగుపిస్తాయి. బ్యాంక్వెట్ రోజున 2వేల మందికి ఏర్పాటు చేసిన విందు రుచి శుచి మురిపంచి వహ్వా అనిపించి అతిథులు చేత లొట్టలేయించి…తదుపరి రెండురోజులు హవ్వా అనిపించి అభిరుచిని చంపించి ఆకలిని మట్టికరిపించాయి. పనిదినం కావడంతో రెండో రోజు బాగా చప్పగా సాగిన వేడుకలు సాయంకాలం జొన్నవిత్తుల రచనలో వందేమాత్రం స్వరాల్లో 120 మంది ప్రవాసుల అద్భుత నృత్యంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించి రుచికరంగా మార్చాయి. 5వేల మందితో కిక్కిరిసిన ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో మూడోరోజున ఏర్పాటు చేసిన నాట్యాలు, గీతాలాపన వంటివి ఆకర్షించలేకపోయినా కాసేపు ఆనందపరిచాయని చెప్పుకోవచ్చు. ఇతర ఆకర్షణీయ సాంస్కృతిక కార్యక్రమాలకై ప్రవాసులు చేసిన కృషి అభినందనీయం. ఏడుగురు సినిమావాళ్లు, ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ సంగీత దర్శకుడు ఈ సభలకు అతిథులుగా హాజరయ్యారు. విభజన అనంతరం ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు పెద్దసంఖ్యలో ఒకే వేడుకకు హాజరుకావడం ఈ సభల అతిపెద్ద విజయం. ఆంధ్రా-తెలంగాణా సంస్కృతులను వేడుకలు చక్కగా ప్రతిబింబించాయి.


మీ సొమ్ములు మీ బిడ్డల భవిష్యత్‌కు వాడుకోవాలని జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన సూచన మేలైనది. వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్న నేటి తరుణంలో………..భారతీయ సంస్కృతి-సాంప్రదాయాల పరిరక్షణకు ప్రవాసంలో భారతీయుల గళానికి విలువ ఏర్పడటానికి స్వచ్ఛంద సంస్థలుగా చెలామణిలో ఉన్న తెలుగు సంఘాలు ఇండో-అమెరికన్ల వెనుక నిలబడి చేయుతను ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తి మన్నించదగినది. జర్మనీ వలసదారుల కుటుంబంలో జన్మించిన ట్రంప్ నేడు అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు భారతీయులకు ఆ అవకాశం ఎంతో దూరంలో లేదని ఆయన చేసిన ప్రసంగం కీలకమైనది.సభల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన మరో అంశం – రాజకీయ పార్టీల కంపును ప్రధాన వేదికకు ఎక్కించకపోవడం. మూడోరోజున మూడో అంతస్థులో నాలుగు గోడల మధ్య ఎన్నారై వైకాపా సమావేశాన్ని నిర్వహించుకుని ఆ “ఫ్యాను” గాలి అక్కడే వదిలేసి ప్రధాన వేదిక వరకు తీసుకురాకపోవడం హర్షించదగిన విశేషం.మొత్తమ్మీద సేవ చేస్తూ సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి సలుపుతున్నామని ప్రచారం చేసుకునే ప్రవాస తెలుగు సంఘాలు సఖ్యతను ప్రాధామ్య క్రమంలో ముందుకు జరపాలని “సేవ-సంస్కృతి-సఖ్యత” నినాదంతో ఆటా-టాటాలు నిర్వహించిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ గట్టిపాఠాలే చెప్తోంది. నేర్చేది ఎవరో మరి? సేవా కార్యక్రమాలకు సొమ్ములను మరింతగా ఆదా చేసుకునేది ఇంకెప్పుడో మరి? ఆధిపత్య పోరుకు అంతం ఎక్కడో మరి? —సుందరసుందరి(sundarasundari@aol.com)

ఆటా-టాటా సభల్లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు-TNI ప్రత్యేకం

తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను డల్లాస్‌లో నిర్వహిస్తోన్న అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంస్థల అమెరికా తెలుగు మహాసభల్లో నిర్వహించారు. తెలంగాణా నుండి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణాలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. అనంతరం కేక్ కోసి జై తెలంగాణా నినాదాలు చేశారు.

ఆటా-టాటా సభల్లో ఎన్నారై-వైకాపా సమావేశం:TNI ప్రత్యేకం

డల్లాస్ వేదికగా ఆటా-టాటా సంస్థలు నిర్వహిస్తున్న అమెరికా తెలుగు మహాసభల్లో మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఎన్నారై-వైకాపా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుండి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ప్రవాసాంధ్ర ప్రముఖుడు డా.ప్రేమ్ రెడ్డి, శ్రీసిటీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వై.ఎస్.ఆర్‌తో తమ అనుభవాలను సభికులతో పంచుకున్నారు. సభాప్రాంగణం జోహార్ వై.ఎస్.ఆర్-జై జగన్ నినాదాలతో మారుమ్రోగింది.

వైభవంగా ముగిసిన ఆటా-టాటా ప్రప్రథమ అమెరికా తెలుగు మహాసభలు:TNI ప్రత్యేకంప్రవాస సంఘాలు అమెరికన్ రాజకీయాలను శాసించాలి-యార్లగడ్డ ఆకాంక్ష:TNI ప్రత్యేకం


అమెరికాలో తెలుగు మహాసభలు నిర్వహించేటప్పుడు ప్రవాస తెలుగు సంస్థలు భారతదేశం నుండి అతిథులను అధిక ఖర్చుతో ఆహ్వానించి ఆదరించడం మానేసి ఆ సొమ్మును అమెరికన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న భారతీయ అమెరికన్లకు వెచ్చించాలని తద్వారా అమెరికాలోని తమ భావితరాల వారికి మంచి భవితను కల్పించిన వారు అవుతారని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. శనివారం సాయంత్రం అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికా తెలుగు సంఘం(టాటా)ల సంయుక్త ఆధ్వర్యంలో ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన అమెరికా తెలుగు మహాసభల ముగింపు రోజు కార్యక్రమాల్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న అనంతరం ప్రసంగించారు. మరుగుదొడ్లు, రహదారులు, ఆసుపత్రులు వంటి వాటికి ప్రభుత్వాల వద్ద ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము చాలానే ఉందని, అమెరికాలో కష్టపడి సంపాదించిన ప్రతి డాలరును అమెరికన్ సమాజంలోనే తెలివైన రీతిలో ఖర్చు చేస్తే తమ బిడ్డలకు భారతీయులతో పరిపుష్ఠమైన ఓ శక్తిమంతమైన సమాజాన్ని అందించిన వారవుతారని యార్లగడ్డ పేర్కొన్నారు. ఎన్.టీ.ఆర్ తెలుగువారు అమెరికా అధ్యక్షులు అవుతారని 1993లో న్యూయార్క్‌లో అన్నారని, ఆ దిశగా ప్రవాసులు కూడా కృషి చేయాలని యార్లగడ్డ చేసిన విన్నపానికి 4000మందితో కూడుకున్న ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరు ఈలలు-చప్పట్లతో సందడిగా మారింది. రాజా కృష్ణమూర్తి, అరుణా మిల్లర్, చివుకుల ఉపేంద్ర వంటి ఇండో-అమెరికన్ల రాజకీయ ప్రచారాలు పోరాటాలకు ప్రతి ప్రవాస తెలుగు సంఘం ఆలంబనగా నిలబడి వారి సెనేటర్లుగా, కాంగ్రెస్‌మెన్లుగా గెలిపించాలని అప్పుడు అమెరికాలో భారతీయుల గళంలో మృగరాజు గర్జన వినిపిస్తుందని ఆయన అన్నారు. ఎన్.టీ.ఆర్ తెలుగు తెలుగు అంటూ భాష కోసం ప్రాణం ఇచారని, వై.ఎస్.ఆర్ ఆ తెలుగుకు ప్రాచీన హోదా కోసం కృషి చేశారని కొనియాడారు. ఆటా-టాటా సంస్థలు “సేవ-సంస్కృతి-సఖ్యత” అనే నినాదంతో ఈ వేడుకలు నిర్వహించి సేవ చేస్తూ సంస్కృతిని కాపాడుకునే ప్రవాస తెలుగు సంస్థలకు మొట్టమొదట కావల్సింది సఖ్యత అని చాటిచెప్పారని ఆయన అభినందించారు. ఆటా అధ్యక్షుడూ డా.ఆసిరెడ్డి కరుణాకర్, టాటా అధ్యక్షుడు డా.హరనాథ్ పొలిచెర్ల, ఆటా వ్యవస్థాపకుడు హన్మంత్‌రెడ్డి, టాటా వ్యవస్థాపకుడు డా.పైళ్ల మల్లారెడ్డి, ఆటా మాజీ అధ్యక్షురాలు గవ్వా సంధ్యారెడ్డి తదితరులు లక్ష్మీప్రసాద్‌ను జ్ఞాపికతో సత్కరించారు.


తెలుగోడు లేని అమెరికా వెలగదు-సోమిరెడ్డి:TNI ప్రత్యేకం


2018 dallas telugu conference american telugu convention america telugu association telangana american telugu associationa ata-tata 2018 irving telugu dallas telugu conference
అదరగొట్టిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ విందు భోజనాలు


డల్లాస్ వేదికగా అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందు భోజనం అద్భుతంగా ఉందని అతిథులు అభినందించారు. గారె, సమోసా, వెజ్ కబాబ్, గోట్ పెప్పర్ ఫ్రై, పకోడి, వెజ్ బిరియాని, పలురకాల మాంసం కూరలు రుచికరంగా ఉన్నాయి. అతిథులను అలరించాయి.

ఆటా-టాటా సభలో తానా నేతల సందడి

డల్లాస్ వేదికగా అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌లో తానా నేతలు సందడి చేశారు. అధ్యక్షుడు వేమన సతీష్ నేతృత్వంలో పలువురు కార్యవర్గ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని వేడుకల నిర్వాహకులకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

అట్టహాసంగా “ఆటా-టాటా” అమెరికన్ తెలుగు కన్వెన్షన్ ప్రారంభం-చిత్రాలు:TNI ప్రత్యేకం


tata ata 2018 dallas american telugu convention tnilive gallery tnilive.com telugu news international international telugu news dallas telugu news

tags: american telugu convention 2018 ata tata american telugu association telangana american telugu association ata-tata dallas telugu convention conference karunakar asireddy haranath policherla

నేటి నుండే అమెరికన్ తెలుగు కన్వెన్షన్. ముస్తాబైన డల్లాస్.

అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా)ల సంయుక్త ఆధ్వర్యంలో నేటి నుండి మూడురోజుల పాటు ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో అమెరికన్ తెలుగు కన్వెన్షన్ పేరిట భారీ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పెద్దసంఖ్యలో అతిథులు, నాయకులు, కళాకారులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. గురువారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.


tags: american telugu convention 2018 atc2018 dallas telugu conference convention 2018 tnilive ata tata

అమెరికా తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు


American Telugu Convention – A Unique Experiment by ATA and TATA

A formal announcement by the two Telugu Organizations to Conduct a joint Convention , two years ago an undeterred commitment by the two leaders – Mr. Hanmanth Reddy of ATA and Dr. Pailla Malla Reddy of TATA – led their leadership team to walk the talk – the leadership teams of Board of trustees and Executive committees of the two organizations have walked on a rough road of formulating the mode of operations between the two organizations in executing the mammoth Convention at the Sprawling Irving Convention Center. The road was rough, but the commitment was steely to lay the path.
7 days to go for the convention and the team of 40 committees, 300 volunteers, is more than ready to deliver the event. The kick of meeting was held less than 6 weeks ago. A lesser resolve will have shattered the hearts of the cadre on ground. Historically, all the Conventions of the Telugu Organizations were planned for at least 1.5 years. No Convention in the past was executed in such a short time. The Joint Executive Committee and the Individual Committee chairs have said in the press meet over the weekend that, if the event was to be executed tomorrow, they were more than ready.

The Convention not only show cases our traditional Arts and Crafts, but also helps preserver and promote the ancient Indian music, dance, poetry and modern art of movie making. The event committees have conducted arts competitions, short film contests and planned live concert with musical instruments. The Convention is also providing a huge platform for matrimonial services for the youth of the indian diaspora. The massive event also houses panel discussions where youth will be given guidance on their career. The Convention has also summoned the expertise of movies industry to give insights about movie making.
To emphasize the spiritual aspect of our culture, the organizers have planned for Srinivasa Kalyanam on June 2nd.

As the Indian diaspora is always connected to their motherland through movies, the convention is inviting a galaxy of movie stars and singers to meet with them on the occasion and spend time with their favorite artists, a luxury, which the diaspora will not want to miss.

To finish the circle, the Organizers have invited a huge number of politicians to listen to the current affairs in their home states and provide inputs in development of their home state.

It is no exaggeration that all eyes will be on happenings at the Irving Convention Center, Dallas,TX between May 31- June 2nd to watch the events unfold at the unique Convention.

It has been a commendable 5 weeks for the two Organizations in setting the stage for the Mega Convention and it is a matter of time before the event sets an example in the NRI Telugu community.

మెగా నాటా డే వేడుకలు

ఫిలడెల్ఫియాలో జులైలో జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి ముందు సెయింట్‌ లూయిస్‌లో మెగా నాటా డే వేడుకలను నిర్వహించారు. సెయింట్‌ లూయిస్‌లోని మహాత్మాగాంధీ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మందికిపైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 160 మంది కళాకారులు ఆటా, పాటలతో అతిథులను అలరించారు. చెస్‌, మాథ్స్‌ పోటీల్లో120 మంది చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కల్చరల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కళాకారులందరికి నిర్వాహుకలు ట్రోపీలను అందజేశారు. స్థానిక గాయకులు మాధురి గాజుల, సుమ ఆరెపల్లి, సాహితి ముంగండిలు కెనడా నుంచి వచ్చిన ధీరజ్‌ బాల్ర, న్యూజెర్సీ నుంచి వచ్చిన దీప్తి నాగ్‌లతో కలిసి తమ గాత్రంతో అభిమానులను హోరెత్తించారు. ఫిలడెల్ఫియాలో జులై 6 నుంచి 8 వరకు జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి వచ్చి విజయవంతం చేయాలని సెయింట్‌ లూయిస్‌ తెలుగు కమ్యునిటీవారిని నాటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి కోరారు. మెగా నాటా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తమ బృందంవారికి కృతజ్ఞతలు తెలిపారు. డీజే రవి జూలకంటి, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్టేజ్‌ డిజైనర్‌ కుమార్‌ రెడ్డి, ఎంసీ నిక్కి భూమా, హన్సితా తెలుగుంట్ల, నర్సిరెడ్డి ఉప్పునూరిలతో పాటూ వాలంటీర్లు ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డల్లాస్‌కు చెందిన తిరుమల రెడ్డి కుంభం(ఫైనాన్సియల్‌ సర్వీస్‌ మానియా), అట్లాంటాకు చెందిన డా. ధనుంజయ రెడ్డి గడ్డం(షెపర్డ్‌ యానిమల్‌ హాస్పిటల్‌‌)లు ఉన్నారు.

అమెరికన్ తెలుగు మహాసభలకు ప్రముఖులు

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన ‘అమెరికా తెలుగు మహాసభల’కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు అమెరికాలోని డాల్‌సలోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ వేడుకల్లో ప్రవాస తెలుగువారు సందడి చేయనున్నారు. దాదాపు ఏడు వేల మంది తెలుగు ప్రవాసులు ఈ సంబరాలకు హాజరవుతారని అంచనా. వీరిలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ పలు రంగాల తెలుగు ప్రముఖులు, కవులు, రచయితలు, పారిశ్రామిక వేత్తలు ఉంటారు.వారితోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక అతిథులు సమావేశాలకు హాజరుకానున్నారు. ఈమేరకు ‘ఆటా’ అఽధ్యక్షుడు డాక్టర్‌ ఆసిరెడ్డి కరుణాకర్‌, బోర్ట్‌ ట్రస్టు సభ్యులు బూజల భువనేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక ఆహ్వాన సంఘం గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రముఖులను ఆహ్వానించడంలో నిమగ్నమైంది. అమెరికా తెలుగు మహాసభల్లో పాల్గొనాలంటూ తెలుగువారైన మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ను ఆహ్వానించారు. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కే చంద్రశేఖర రావునూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకూ ఆహ్వానం అందింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్కడి రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి, అఖిలప్రియ పాల్గొననున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ కవిత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించామని ఆహ్వాన సంఘం తెలిపింది. మహాసభల విజయవంతానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేశామని, తెలుగు జాతి ఔన్యత్యాన్ని చాటేలా మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆసిరెడ్డి కరుణాకర్‌, బూజల భువనేశ్‌ ‘ పేర్కొన్నారు

యార్లగడ్డకు ఆటా-టాటా జీవిత సాఫల్య పురస్కారం

కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు అమెరికన్ తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు కలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31, జూన్‌1, జూన్ 2లలో డల్లాస్‌లో రెండు సంస్థలు ఏర్పాటు చేసిన సదస్సులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కి ఈ పురస్కారం అందజేయనున్నట్టు ఆటా అధ్యక్షుడు డా. కరుణాకర్ రెడ్డి, టాటా అధ్యక్షుడు డా. హరినాథ్ పొలిచెర్ల ప్రకటించారు.1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 4500 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, కళాకారులు, యువకులు ఈ సదస్సులో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఉభయ భాషల్లో పీహెచ్‌డీ చేసి, పద్మభూషణ్, పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక పురస్కారాలు పొంది, 60కి పైగా పుస్తకాలు రచించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు రెండు సంఘాలు తెలిపాయి. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి సాంస్కృతిక వారధిగా, ఆదర్శంగా భావిస్తున్నట్లు ప్రకటించాయి. డల్లాస్‌లో ఉభయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని నిర్వాహకులు పేర్కొన్నారు.

అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

ఆటా-టాటా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఈ నెలాఖరులో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హాజరు కానున్నారని ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకర్ తెలిపారు. బుధవారం నాడు హైదరాబాద్‌లో సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి ఆహ్వానం అందించారు. ఈ పర్యటనలో ఆటా సభ్యులు బూజాల భువనేష్, తిరుపతి శ్రీధర్ తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌కు “ఆటా” ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం-టాటా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మే31 నుండి జూన్2 వరకు డల్లాస్‌లో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ సదస్సుకు హాజరు కావల్సిందిగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకార్ నేతృత్వంలోని బృందం ఆహ్వానం అందించింది. అమెరికాలోని తెలుగువారి అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆటా సంస్థ సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ కొనియాడారు. ఈ బృందంలో ఆటా డైరక్టర్ల బోర్డు సభ్యుడు బూజాల భువనేష్, తిరుపతి శ్రీధర్ తదితరులు ఉన్నారు.