అట్లాంటాలో తామా సంక్రాంతి వేడుకలు


జనవరి 12 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్ మరియు సంక్రాంతి రెస్టారెంట్ వారు సమర్పించగా, సుమారు 1200 మందికి పైగా హాజరై అట్లాంటా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసారు. ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ మరియు ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో సుమారు 250 మంది పిల్లలు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు మరియు మెహందీ లో మహిళలు విరివిగా పాల్గొన్నారు. తదనంతరం సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి స్వాగతోపన్యాసం చేయగా, తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు, శ్లోకాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేసారు. అధ్యక్షులు వెంకీ గద్దె ప్రసంగిస్తూ తామా నిర్వహించే ఉచిత క్లినిక్, స్కాలర్షిప్స్, మనబడి, స్పోర్ట్స్, సాహిత్యం, తదితర విద్య, వైద్యం మరియు వినోద కార్యక్రమాలను వివరించారు. తామా కార్యవర్గం మరియు చైర్మన్ వినయ్ మద్దినేని సారధ్యంలో బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, హరిప్రసాద్ సాలియాన్, జాన్స్ క్రీక్ డిస్ట్రిక్ట్ 50 హౌస్ రిప్రజంటేటివ్ ఏంజెలికా కౌషె, హిందూ టెంపుల్ ప్రెసిడెంట్ షీలా లింగం, అట్లాంటా ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ క్రిస్ గద్దె, స్కాలర్షిప్స్ సమన్వయకర్త సీత వల్లూరుపల్లి, మనబడి సమన్వయకర్త విజయ్ రావిళ్ల మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులను సగౌరవంగా సత్కరించారు. మధ్య మధ్యలో గోదావరి రెస్టారెంట్, విజయ కలెక్షన్స్, నేటివ్ ట్రెండ్స్, ఏబీసీ పార్టీ హాల్ మరియు కేబీ జవేరీ వారు సమర్పించిన గ్రాండ్ రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు. గాయని శిల్ప మరియు గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. వారి పాటలకు పిల్లలు, యువతీయువకులు వేదిక మీదకు వెళ్లి మరీ డాన్స్ చెయ్యడం విశేషం. గాయని శిల్ప నిర్వహించిన సంప్రదాయ దుస్తుల పోటీలలో మహిళలు, పిల్లలు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ప్రత్యేక ఆహార పదార్దాలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు ఎక్కువగా ఫేస్ పెయింటింగ్ స్టాల్ దగ్గర తిరుగుతూ కనిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ రావిళ్ల, శ్రీని బలుసు, వెంకట్ గోగినేని, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, విజయ్ బాబు కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, రమణ, చైతన్య, అరుణ మద్దాళి, సునీత పొట్నూరు, అబ్దు, రీమ, సాన్వి, అక్షు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ అందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, రుచికరమైన భోజనాలందించిన సంక్రాంతి రెస్టారంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, సమర్పకులు శూరా ఈబి 5 ఫండ్ ప్రసాద్ గద్దె, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ సాలియాన్, నార్క్రాస్ ఉన్నత పాఠశాల యాజమాన్యం, వ్యాఖ్యాత శ్రీధర్, ది యంగ్ లీడర్స్ అకాడమీ కమల వడ్లమూడి, గ్లోబల్ ఆర్ట్ సుధ గోపాలకృష్ణన్, తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులకు వెంకీ గద్దె ధన్యవాదాలు తెలియజేసి విజయవంతంగా ముగించారు.
వచ్చే 18 నుండి తెలంగాణ జాగృతి అంత‌ర్జాతీయ స‌ద‌స్సు

తెలంగాణ జాగృతి ఈ నెల 18,19,20 తేదీల్లో మూడు రోజుల పాటు అంత‌ర్జాతీయ యువ నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైద‌ద‌రాబాద్‌లోని హెచ్ ఐసిసి లోని నోవాటెల్ హోట‌ల్‌లో స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను గురువారం ప‌రిశీలించారు. ప‌ద్మ‌భూష‌ణ్ అన్నాహ‌జారే 19వ తేదీన జ‌రిగే ప్రారంభ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. సార్క్ మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అర్జున్ బ‌హ‌దూర్‌ తాపా ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌వుతారు. 20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు స‌మావేశానికి గ‌వ‌ర్న‌ర్ ఇ.ఎస్‌.ఎల్ న‌ర‌సింహ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. *గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్క‌ర‌ణ‌లు* అనే అంశంపై స‌ద‌స్సు ప్ర‌ధానంగా కేంద్రీక‌రిస్తుంది. 135 దేశాల నుంచి 550 మంది ప్ర‌తినిధులు స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతారు. 16 దేశాల నుంచి 70 మంది వ‌క్త‌లు, 40 మంది ప్ర‌త్యేక ఆహ్వానితులు హాజ‌ర‌వుతారు. చ‌ర్చా గోష్టుల‌కోసం ప్ర‌త్యేక హాళ్ల‌ను ఏర్పాటు చేశారు.మొద‌టి రోజు యువ‌త అభివృధ్ధి పై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ శేఖ‌ర్ గుప్తా చ‌ర్చా గోష్టిని నిర్వ‌హిస్తారు. అసోం ఎంపి గౌర‌వ్ గ‌గోయ్‌, హైద‌రాబాద్ ఎంపి అస‌దుద్దీన్ ఒవైసితో పాటు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ప్యాన‌లిస్టులుగా పాల్గొంటారు. Gandhi, Youth and Sustainability: Perspectives from The World అంశంపై యూకె ఎంపి సీమా మ‌ల్హోత్రా, న్యూజిలాండ్ ఎంపి క‌న్వ‌జిత్ సింగ్ భ‌క్ఛి, యునైటెడ్ నేష‌న్స్‌లో నేపాల్ శాశ్వ‌త ప్ర‌తినిధి మ‌ధు రామ‌న్ ఆచార్య‌, శ్రీలంక ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ ఉప మంత్రి బుదికా ప‌థిరాణా, మాసిడోనియా రిప‌బ్లిక్ పెట్టుబ‌డుల శాఖ మాజీ మంత్రి గ్లిగ‌ర్ త‌స్కోవిచ్‌, ఒకిన‌వా, అప్ఘ‌నిస్తాన్‌ల‌లో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జాన్ డిక్స‌న్ చ‌ర్చ‌లో పాల్గొని ప్ర‌సంగిస్తారు. రెండో రోజు నైపుణ్య శిక్ష‌ణ‌, స‌మ‌తులాభివృద్ధిలో యువ‌త‌, మ‌హిళ‌ల పాత్ర‌, కార్పోరేటు,ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యం పై చ‌ర్చిస్తారు. వీటిని అంత‌ర్జాతీయంగా ఆయా రంగాల్లో నిష్టాతులు నిర్వ‌హిస్తారు. గాంధేయ‌ మార్గంలో సుస్థిర అభివృద్ధి, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు అంశంపై స‌ద‌స్సులో చ‌ర్చిస్తామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు.2030 వ‌ర‌కు భ‌విష్య‌త్ మాన‌వాళి మ‌నుగ‌డ‌కు అవ‌స‌ర‌మైన ప్రాథ‌మిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ఐక్య‌రాజ్య స‌మితి విడుల చేసిన 17 అంశాల ల‌క్ష్యాల సాధ‌న‌లో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ను నిర్వ‌హిస్తున్న‌ద‌ని ఆమె తెలిపారు. 135 దేశాల నుంచి 550 మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నార‌ని తెలిపారు. 40 మంది వివిధ రంగాల‌కు చెందిన వారు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌వుతార‌ని ఎంపి క‌విత వివ‌రించారు. ఐక్య‌రాజ్య స‌మితి నిర్దేశించిన 17 ల‌క్ష్యాలు, అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సులో చ‌ర్చించే అంశాలు
1. పేద‌రిక నిర్మూల‌న‌
2. ఆహార స‌మృద్ది
3. ఆరోగ్యం
4. నాణ్య‌మైన విద్య‌
5. లింగ స‌మాన‌త్వం
6. మంచి నీరు-ప‌రిశుభ్ర‌త‌
7. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల విద్యుత్‌
8. గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ని, ఆర్థికాభివృద్ధి
9. ప‌రిశ్ర‌మ‌లు, మౌళిక వ‌స‌తులు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు
10. అన్ని రంగాల్లో స‌మాన‌త్వం
11.ప‌ర్యావర‌ణ అనుకూల న‌గ‌రాలు, గ్రామాలు
12. బాధ్య‌తాయుత‌మైన వ‌న‌రుల వినియోగం
13.వాతావ‌ర‌ణంలో మార్పులు-మాన‌వాళి బాధ్య‌త‌
14. స‌ముద్ర జీవుల సంర‌క్ష‌ణ‌
15. భూచ‌రాల జీవ‌నానికి అనుకూల వాతావార‌ణంకు కృషి
16. శాంతి, న్యాయం దిశ‌గా ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటు
17. పై ల‌క్ష్యాల కోసం వ్య‌వ‌స్థ‌లు, దేశాల ప‌ర‌స్స‌ర స‌హాకారం

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి-తీన్మార్ వేడుకలుచికాగో ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

జనవరి 12వ తేదీ సాయంత్రం మనం చికాగో ఆంధ్ర సంఘం “పల్లె సంబరాలు” అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విధంగా వీనులవిందుగా జరుపకున్నాము. ముందటి రోజు నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న హిమపాతం, చలిగాలులు, రహదారులపై చాలనం దుర్భరంచేసే విధంగా పేరుకుపోయిన మంచు, నడవటానిక్కూడా కష్టంగా మారిన కాలిబాటలు. తెలుగువారినందరినీ ఒక చోటికి తెచ్చి మన తెలుగు పల్లెల జీవనవిధానాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలన్న మన చికాగో తెలుగు ఆడుపడుచుల సంకల్పానికి ఇవేవీ అడ్డుకాలేకపోయాయి. చికాగో పరిసర పట్టణాలన్నిటినుంచీ 1000కి పైగా తెలుగువారు తరలివచ్చి వేడుకలకు శోభతెచ్చారు.

ఆనాటి కార్యక్రమం దీప ప్రజ్వలన, ప్రార్ధనా గీతం, చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయటం, వినాయక స్థుతితో ప్రారంభమైంది. శ్రీమతి జానకి ఆనందవల్లి నాయర్ గారి విద్యార్ధులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం “దేవీస్థుతి రాగమాలిక”, శ్రీమతి అపర్ణ ప్రశాంత్ విద్యార్ధుల బృందం ప్రదర్శించిన “జతిస్వరం” లను ప్రేక్షకులు కరతాళధ్వనులతో ప్రశంసించారు. చిన్నారులు నర్తించిన అనేక సినీ గీత నృత్యాలు అందరినీ అలరించాయి. శిల్ప పైడిమర్రి సమన్వయించిన మహానటి పాటల నృత్యాలు అందరినీ మెప్పించాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించిన అనేక సినీ నృత్యగీతాలు ప్రేక్షకులను కూడా తమతోపాటు నర్తించేలా చేశాయి. శ్రీమతి వాణి దిట్టకవి రూపొందించి, స్వర సంయోజనం, ధ్వనిముద్రణ, సమన్వయం చేయగా శ్రీమతి జ్యోతి వంగర నృత్యదర్శకత్వంలో మూడురోజుల సంక్రాంతి వేడుకలను ప్రతిబింబిస్తూ 60మందికి పైగా పాల్గొన్న సంక్రాంతి రూపకం 20 నిమిషాలపాటు ప్రేక్షకులను సమ్మోహనపరచి మెప్పించింది. సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి సాంస్కృతిక కార్యక్రమాలను, వేదిక నిర్వహణను చాలా చక్కగా సమర్ధవంతంగా చేసి అందరి మన్ననలూ పొందారు. మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, సుజాత అప్పలనేని, వాణి దిట్టకవి వారికి సలహాలు, సూచనలు అందిస్తూ అన్నిటా తోడుగా నిలిచారు.

శ్రీనివాసమూర్తి పద్యాలగారు రూపొందించిన ఎడ్లబండి, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన అలంకరణలు, ద్వారం, ముగ్గులు, గాలిపటాలు, అందరికీ ఒక చక్కని అనుభూతినిచ్చాయి, ఫోటోలు వీడియోల రూపంలో గుర్తుంచుకొనేలా మిగిలాయి.

శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో దాదాపు 20మంది ఆడపడుచులు ఉత్సాహంగా వేదికపై చేసిన అలంకరణలు, జయశ్రీ సోమిశెట్టి, భార్గవి నెట్టెం చిత్రించిన వేదిక నేపధ్య చిత్రాలు, శ్వేత కొత్తపల్లి, శైలజ సప్ప కూర్చిన సంక్రాంతి బొమ్మలకొలువు ప్రత్యేక ఆకర్షణలుగా అందరి మెప్పును పొందాయి. సమత పెద్దమారు చేసిన దీపవనితల అలంకరణ మరో ప్రత్యేక ఆకర్షణై విశిష్టంగా నిలిచింది.

శ్రీశైలేశ్ మద్ది, శ్రీనివాసమూర్తి పద్యాల గారు రూపొందించిన లోగోలు, బానర్లు, ప్రచార కరపత్రాలు, కార్యక్రమ వివరాల కరపత్రం కనులవిందుగా వుండి అందరి ప్రశంసలనూ పొందాయి. వారే రూపొందించి ముద్రించిన 2019 తెలుగు కాలెండర్ అత్యంత ఆకర్షణీయంగా ఏడాది పొడవునా ఉపయోగించుకునేవిధంగా నిలిచింది. సంఘ సభ్యులకు తీసిన ఛాయాచిత్రాన్ని కాలెండర్ తో జతచేసి కార్యక్రమం చివరలో సభ్యులకు అందించడం చాలా మందిని విస్మయానందానికి గురిచేసింది. కార్యక్రమ నిర్వహణను కిరణ్మయి మట్టే, శైలజ చెరువు, సుందర్ దిట్టకవి సమయపాలన తప్పకుండా నిర్వహించారు.

చైర్మన్ దినకర్ కారుమూరి చికాగో ఆంధ్ర సంఘపు పూర్వ నాయకత్వాన్ని సత్కరించారు. సంఘ అధ్యక్షులు అప్పలనేని పద్మారావు మాట్లాడుతూ ఈ ఏడాదంతా నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించి, సంఘ సభ్యులకు, స్పాన్సర్లకు, విచ్చేసిన గౌరవ అతిధులకు, పెద్దలకు, అన్ని బాధ్యతలను స్వఛ్ఛందంగా తీసుకుని చక్కగా నిర్వహించిన కార్యకర్తలకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం అన్నిచోట్లా తామేవుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, సీనియర్ డైరెక్టర్ శ్యామ పప్పు గారు అతిథి స్వాగత సత్కారాలను నిర్వహించారు. సంఘ యువ డైరెక్టర్లు మైత్రి అద్దంకి, శృతి మోత్కూర్, నిఖిల్ దిట్టకవి యవత కోసం తమ ప్రణాళికలు వివరించారు.

ఈ కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక సంపత్తిని, సహకారాన్ని మణి తెల్లాప్రగడ, పద్మాకర్ దామరాజు, కిరణ్ ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ శైలేశ్ మద్ది, సంధ్య అప్పలనేని సమకూర్చారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సురేశ్ శనక్కాయల, అనురాధ గంపల, కిరణ్మయి వంకాయలపాటి, శ్రీకృష్ణ మతుకుమల్లి, నీలిమ బొడ్డు, హరచంద్ గంపల, శ్రీనివాస్ ధూళిపాళ్ళ, రమేశ్ నెక్కంటి సమర్ధవంతంగా నిర్వహించారు.

పులగం అన్నంతో సహా సంప్రదాయ సంక్రాంతి విందుభోజనాన్ని బావర్చి బిర్యానీస్, నేపర్విల్ వారు (కరుణ్ జాస్తి, నవీన్ దేవినేని) అందించగా, భోజన ఏర్పాట్లను శ్రీహరి జాస్తి, సాయిరవి సూరిభొట్ల, విజయ్ కొరపాటి, సురేశ్ పొనిపిరెడ్డి, సత్య తోట, విష్ణువర్ధన్ పెద్దమారు, సత్య నెక్కంటి, ఇంకా ఎంతోమంది కార్యకర్తలు సమర్ధవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలనూ పొందారు. సుజాత అప్పలనేని నేతృత్వంలో మన తెలుగు ఆడుపడుచులు ఇంట్లోనే చేసిన నేతి అరిసెలు చవులూరించి అందరూ వాటిగురించే మాట్లాడుకునేలా చేశాయి.

ఇంత పెద్ద కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నిటినీ ఎంతో విపులంగా ప్లాన్ చేసి నిర్వహించిన ఘనత గౌరీశంకర్ అద్దంకి, మురళి రెడ్డివారి గారికి చెందుతుంది.

ఈ పల్లె సంబరాల కార్యక్రమం పట్ల ఉత్సాహాన్ని ఆసక్తిని రేకెత్తించేలా ప్రోమో వీడియోలు తయారు చేసిన శ్రీమతి లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారికి, సాహితి ఆదిమూలం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఛాయాగ్రహణం, వీడియోగ్రఫి సేవలను అందించిన శ్రీ యుగంధర్ నగేశ్ కండ్రేగుల, స్వదేశ్ మీడియా గారికి కృతజ్ఞతలు.

చక్కని వేదికను, సదుపాయాలను సమకూర్చిన మెటెయా వాలీ హైస్కూల్, ఇండియన్ ప్రెయిరీ స్కూల్ డిస్ట్రిక్ట్ 204 యాజమాన్యానికి, ప్రత్యేకంగా కర్ట్ బక్హార్డ్ట్, ఔరెలీ విలియమ్స్, సుజాన్ కొమరిన్స్కి గార్లకు చికాగో ఆంధ్ర సంఘం విశేష కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

సంఘ కార్యదర్శి శ్రీశైలేష్ మద్ది గారి వందన సమర్పణ, ఇరుదేశాల జాతీయ గీతాలాపనలతో ఈ కార్యక్రమం సుసంపన్నంగా ముగిసింది.

అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

టాగ్స్ రచనల పోటీ విజేతలు వీరే

2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికే పరిమితమైన ఈ పోటీలో అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం. టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net) , సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక లోనూ ప్రచురించబడతాయి.

ప్రధాన విభాగం:
“ఉత్తమ కథానిక విభాగం విజేతలు”
1.సీతారామాంజనేయులు – సత్యం మందపాటి (టెక్సాస్, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.మిధిల – మానస చమర్తి (మసాచుసెట్స్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.ప్రేమించిచూడు – ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా) : ($28, ప్రశంసా పత్రం)

కన్సొలేషన్ బహుమతులు గెలిచుకున్నవారు:
1.దైవం అంటే విగ్రహం కాదు నిగ్రహం – రాజశేఖర్ పరుచూరి (కెంటకీ, అమెరికా)
2.సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం – కల్యాణి జీ యెస్ యెస్ (రాక్లిన్, కాలిఫోర్నియా, అమెరికా)

ఉత్తమ కవిత విభాగం విజేతలు:
1.ఆఫ్రికా..ఆఫ్రికా – సీతారామరాజు రాపోలు (దక్షిణాఫ్రికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ఏమి వింతయో : ఉత్పల మాలలు – మల్లేశ్వరరావు పోలిమేర (టెక్సస్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.ముల్లు – మానస చామర్తి (మసాచుసెట్స్, అమెరికా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కన్సొలేషన్ బహుమతులు గెలిచుకున్నవారు:
1.మాతృదేవోభవ – గంగావర ప్రసాద్ వరకూర్ (డాన్ వెల్లి, కాలిఫొర్నీయా, అమెరికా)
2.వెన్నెల – రాధిక నోరి (ఫ్లోరిడా, అమెరికా)
================================================

“మొట్టమొదటి రచనా విభాగం”
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
1.అద్దం – రవికాంత్ పొన్నాపల్లి (టెక్సస్, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ – సూర్య అల్లంరాజు (మెరీలాండ్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.చిన్ననాటి జ్ఞాపకాలు – రాధ అనుపూరు (ఆస్ట్రేలియా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
1.వట వృక్షం – ఉమాదేవి అద్దేపల్లి (శాన్ హోసే , కాలిఫోర్నియా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.అమ్మ – సూర్య అల్లంరాజు (మెరీలాండ్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారలు అందజేసిన గ్రీట్ వే సంస్థకు టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి వారి కధ, కధానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు telugusac@yahoo.com కు పంపవచ్చును. ధన్యవాదాలు.

భవదీయులు,
శాక్రమెంటోతెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం:
అనిల్మండవ (చైర్మన్),
మల్లిక్సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్),
నాగ్దొండపాటి (అధ్యక్షులు),
దుర్గచింతల (కార్యదర్శి),
మోహన్కాట్రగడ్డ (కోశాధికారి),
రాఘవచివుకుల (సమాచార అధికారి)
సత్యవీర్సురభి (సలహామండలి సభ్యుడు)
వెంకట్నాగం (ట్రస్టీ)
వెంకటేష్రాచపూడి (కార్యకర్త)
ఈమెయిలు: telugusac@yahoo.com

లాన్సింగ్ లో 19న సంక్రాంతి సంబరాలు

మిచిగాన్ రాజధాని లాన్సింగ్ లో తెలుగు సంఘం ఆద్వర్యంలో వచ్చే 19వ తేదీన సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించవచ్చు.

సెయింట్ లూయీస్ నూతన కార్యవర్గం ఇదే

అమెరికాలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయిస్‌ మిస్సోరి స్టేట్‌ యూఎస్‌ఏ(టాస్‌) జనరల్‌ అసెంబ్లీ నిర్వహించింది. టాస్‌ పరిపాలనా విభాగాన్ని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాస్‌ పరిపానా విభాగానికి ఎన్నికైన సభ్యులందరూ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి 800మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 2019-2020
ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌- సురేంద్ర బచిన
వైస్‌ ప్రెసిడెంట్‌-వెంకట్‌ గోని
ట్రెజరర్‌- రంగ సురేష్‌ చక్కా
కల్చరల్‌ సెక్రటరీ- అర్చన ఉపామక
ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ- తిరుమల రమేష్‌ కొండముట్టి

బీఓడీ 2019-2022
బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ – జనార్థన్‌ రావు విజేండ్ల
బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌- శ్రీనివాసరావు భూమ

హ్యూస్టన్‌లో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు

హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ ఆద్వర్యంలో వచ్చే జనవరి 19వ తేదీన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తీ వివరాలు ఈ క్రింది బ్రోచర్ లో చూడవచ్చు.

కృష్ణా జిల్లా తిరువూరులో డిజిటల్ తరగతి గది ప్రారంభించిన తాళ్లూరి జయశేఖర్


అమెరికాలోని కొలంబస్‌కు చెందిన ప్రవాసుడు, “టాకో” మాజీ అధ్యక్షుడు సామినేని రవి విరాళంతో సమకూర్చిన డిజిటల్ తరగతి గదిని కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నాడు ప్రారంభించారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఈ తరగతి గదిని ప్రారంభించారు. ఏపీ జన్మభూమి పథకం కింద అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తొన్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు స్పందించి తిరువూరులో దీన్ని ఏర్పాటుకు విరాళమందించినట్లు రవి సామినేని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కిలారు విజయబిందు, ఎంపీపీ గద్దె వెంకన్న, మాజీ తహశీల్దార్ పొట్లూరి తిరుమలరావు, రవి కుటుంబ సభ్యులు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో వేడుకగా అమెరికా అక్కినేని అవార్డుల ప్రదానం


అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో కరీంనగర్‌లో శనివారం నాడు నిర్వహించిన 5వ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో ప్రముఖులయిన సుద్దాల అశోక్‌తేజ, ప్రొ.ఎస్.నాగేశ్వర్, వనజీవి రామయ్య దంపతులు, సజ్జా కిషోర్‌బాబు, సదాశివశాస్త్రి తదితరులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డా.తోటకూర ప్రసాద్, రావు కల్వల, ఆకునూరి శారద, వెన్నం మురళీ, డా.వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కారాల ప్రాధాన్యత గురించి AFA వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వివరించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకరరావు, కరీంనగర్ మేయర్ రవీంద్రసింగ్, జడ్పీ చైర్‌పర్సన్ తులా ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో రక్తదాన శిబిరం


మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో రక్త దాన శిబిరం

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో రక్త దాన శిబిరం నేషనల్ బ్లడ్ సెంటర్ మలేషియా లో విజయవంతముగా నిర్వహించారు. మహత్మా గాంధీ 150వ జన్మదిన సంబరాలలో భాగంగా ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సహకారముతో దాదాపు 50 మంది మైట సభ్యులతో విజయవంతంగా నిర్వహించామని మైట అధ్యక్షుడు సైదం తిరుపతి తెలియజేసారు.

ఈ శిబిరంలో పాల్గొన్న దాతలందరికి వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీ రవి చంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి జనరల్ సెక్రటరీ రవి చంద్ర,ముఖ్య కార్యవర్గ సభ్యులు కార్తీక్ ,సందీప్,మారుతి,రవి వర్మ ,చందు ,వెంకటేశ్వర్లు, సత్య ,నరేందర్, అశ్విత, చిట్టి బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
malaysia telangana association myta tnilive 2018 telugu news international

APTA అధ్యక్షుడిగా నటరాజు

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 2019-2020 నూతన కార్యవర్గ ఎన్నికల్లో ఆప్త అధ్యక్షుడిగా నటరాజు యిల్లూరి ఎన్నికయ్యారు.

టాంటెక్స్ ఆధ్వర్యంలో అష్టావధానం


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సును ఆదివారం నాడు డల్లాస్‌లో వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం లాస్య కండేపి , సహస్ర కాసం , సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్థనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. అవధాన ప్రారంభసూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతాన్ని ఆలపించారు. సాహితి వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ గరుడ గమన గీతాన్ని ఆలపించారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులు డా.పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా, జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం తదితర అంశాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ‘వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్’ అన్న సమస్యని శివాజీకి వర్తింపచేస్తూ అద్భుతంగా పూరించారు, పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో చేధించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి, ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా.పుదూర్ జగదీశ్వరన్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో సన్మానించి “అవధాన విరించి” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్.రావు, రామకృష్ణ రోడ్ద తదితరులు పాల్గొన్నారు.ఉత్సాహంగా “టాకో” దీపావళి వేడుకలు


తెలుగు అసోసియేషన్ అఫ్ సెంట్రల్ ఒహియో(టాకో) అధ్యక్షుడు శ్రీకాంత్ మునగాల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కొలంబస్ లోని వెస్టర్విల్ సెంట్రల్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు ఉల్లాసంగా పాల్గొన్నారు. చిన్నారుల దీపావళి పండుగ నృత్య రూపకము, పెద్దలు చేసిన వెస్ట్రన్ డాన్స్ పెరఫార్మన్సులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాఘవేంద్రరావుకు అంకితమిచ్చిన “సౌందర్యలహరి”, అర్ధనారీశ్వర నృత్యము, ఆర్ పీ పట్నాయక్ మ్యూజికల్ షో శ్రోతలను అలరించింది. 2018 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేసిన తన కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మునగాల జ్ఞాపికలను బహుకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌మేన్ బాల్డర్సన్ హాజరయ్యారు. శ్రీకాంత్ మునగాల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్(అడ్మిన్) హనుమాన్ కనపర్తి, వైస్ ప్రెసిడెంట్(కమ్యూనికేషన్స్) జగన్నాథ్ చలసాని, వైస్ ప్రెసిడెంట్(కల్చరల్) సుశీల బొమ్మన, వైస్ ప్రెసిడెంట్( స్పోర్ట్స్) హర్ష కామినేని, వైస్ ప్రెసిడెంట్( మహిళా క్రీడా విభాగం) హారిక బల్లెకరి, వైస్ ప్రెసిడెంట్(ఈవెంట్స్) రంగనాథ్ గుల్లిపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫణిభూషణ్ పొట్లూరి, ట్రెజరర్ స్వామి కావలి, జాయింట్ సెక్రటరీ కాళీప్రసాద్ రాజు మావులేటి, కల్చరల్ కోఆర్డినేటర్లయిన వర్దిని ప్రత్తిపాటి, శిరీష పార్శి, సుప్రియ తోట, మాధురి ముసునూరి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ వినోద్ కొస్కె, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సుధీర్ కనగల, వెబ్ కోఆర్డినేటర్ విజయ్ కాకరాల, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రజనీకాంత్ ఆనంతోజి, ఈవెంట్ కోఆర్డినేటర్లయిన ప్రదీప్ చందనం, విజయ్ గౌడ్ మల్లెల, ఫుడ్ కోఆర్డినేటర్లయిన కిషోర్ గాజుల, రజనీకాంత్ కట్టె, టస్ట్రీలు నాగేశ్వరరావు మన్నే, రమేష్ కొల్లి, ప్రసాద్ కాండ్రు, శ్రీధర్ వేగసీన, మురళి పుట్టి తదితరులు పాల్గొన్నారు.
కాన్సాస్ ప్రవాసుల దీపావళి వేడుకలు


తెలుగు అసోషియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటి (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూవ్యాలీ నార్త్‌వెస్ట్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశేషు రేపల్లె స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. శ్రీకాంత్ రావికంటి-జాహ్నవి వడ్దిపర్తిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అధ్యక్షుడు గుండు సురేష్ వంద సమర్పణ చేశారు. ఉపాధ్యక్షులు శివ తీయగూరు, కార్యదర్శి వంశి సువ్వారిలు సభికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా TCAGT దీపావళి వేడుకలు


The Telugu community of Greater Toronto Area have celebrated “Diwali’ with great enthusiasm at Bishop Allen Academy auditorium in Etobicoke, GTA, Canada. Hundreds of Telugu families from surrounding cities Toronto, Markham, Brampton, Mississauga, Oakville, Waterdown, Kitchener, Waterloo, Cambridge, Hamilton, Milton and other areas have joined the six hour long program that is packed with music, drama, dance, comedy and many more. Event started with Socialization. Received remarkable responses from the participants with a glow of happiness and sparkles of joy in participating this event successfully with full of family entertainment. Everyone enjoyed great varieties of South Indian food delights. The venue and stage was decorated by Rekha and Niranjan Ghanta with the help of several volunteers. Colourful floral designs welcoming the Telugu Cultural Association of Greater Toronto (TCAGT) Guests, Sponsors, Members, Families and Friends. The festival has begun with Canadian National Anthem followed by “Deeparadhana”. Executive committee members, Trustees, and the event Sponsors lit the traditional Indian lamp. TCAGT Secretary Koteswara Rao Polavaru delivered the welcome address and highlighted the Diwali event activities, unique programs that were presented to the community this year. He also informed the Telugu Community for the outstanding services that have been provided through this twenty Nine years old Telugu Cultural Association of Greater Toronto (TCAGT).

He spoke about the TCAGT platform that provides the opportunity for the new immigrants to network, make new friends and to preserve the Telugu Cultural heritage in Canada. Telugu families in GTA were able to introduce Telugu Language, Culture and Festive experiences to the kids to embrace. Founders of this association envisioned to pass this for generations to come through this Great Telugu Association. Audience acknowledged and applauded the founders for their vision, hard work, and awesome service to the Telugu Community in Canada. He then introduced the Master of Ceremonies Nandan and Arun Reddy for the evening program to conduct. Treasurer Devi Chowdhary and Chairman Board of Trustees Srinivas Gadepalli delivered festive greetings. President Rajesh Vissa appreciated Executive Committee, Trustees, Advisors, Sponsors and Friends for being part of event and their collaborated efforts as a team for making the event successful. He encouraged participants to join the TCAGT family and support the association for taking up more initiatives for the community. He also highlighted that TCAGT is a Platform for all Telugu families to expose their kids talent, youth and parents to improve connections and explore opportunities of interest across various fields and emerging technologies. President Rajesh & his spouse Sreevani Vissa was felicitated with a Shawl and a Momento by the Founder Bose Vemuri, Trustee Surya Bezawada and the former president Rao Vajha. Event Sponsors Venkat Perugu, Kamakshi Perugu and Murarilal Thapliyal were felicitated with shawls and Momentos by President Rajesh, Sreevani Vissa, Secretary Koteswara Rao and Priya Polavarpu. Guest speaker Dave Bhatia, Lions Zone chair provided greetings. Johnny Bobbili from Toronto Police Dept. informed the importance of joining police department and the hiring process to become Police Officers in Canada. He encouraged the Telugu youth to apply for various positions that are available with the department. SpiceInn served the traditional delicious festive food items to the attendees. Spectacular dance performances choreographed by professionals enthralled all the ages of the community members. Mega musical night was performed by singers Sandeep Kurapati and Ramya Nada. Many attendees acknowledged the executive committee for the preserving, promoting Telugu language and culture for the past twenty nine years. Secretary Koteswara Rao Polavarapu provided vote of thanks and TCAGT event ended with chanting of Indian National Anthem. Indeed, the event has brought fun, excitement and high performance with a great fun.

కేసీఆర్‌పై డాక్యుమెంటరీ రూపొందించిన లండన్ ఎన్నారై తెరాస

ఎన్నారై టీఆర్ఎస్ లండన్ శాఖ రూపొందించిన టీఆర్ఎస్ పార్టీ-కేసీఆర్ ఉద్యమ, అభివృద్ధి చరిత్ర డాక్యుమెంటరీ సీడీని ‘నాడు-నేడు కేసీఆర్ బాటలో..’ ఎంపీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి లండన్ నుండి ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రవేశపెట్టిన సంకేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను డాక్యుమెంటరీలో పొందుపరిచారు. ఈ సందర్బంగా ఎన్నారై యూకే సెల్ బృందం సభ్యులు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించబోయే ఎన్నికల ప్రచార కార్యాచరణపై ఎంపీ కవితతో కలిసి చర్చించి..సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.టీఆర్ఎస్ యూకే సెల్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, నాయకులు మల్లేష్ పప్పుల తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీ సాహిత్యంలో హాస్యంపై టాంటెక్స్ సదస్సు


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, నవంబరు 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన , హమ్సిక ,అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి , జాతీయాలు , పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు. దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరికి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు.డా. పుదూర్ జగదీశ్వరన్ఆ ముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగయుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రాగయుక్తంగా ఎంకి పాటలు పాడి అలరించారు. ముఖ్య అతిధి మల్లవరపు అనంత్ ని చంద్రహాస్ సభకు పరిచయం చేయగా టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ “శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి…. ఆయన రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుంది” అన్నారు. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు. అనంతరం అనంత్‌ను టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంత్ మల్లవరపు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ అనంత్ మల్లవరపు సాహిత్య సేవలను ఎంతో కొనియాడారు మరియు తను నిర్వహించిన పూర్వ సాహిత్య సదస్సులను గుర్తుచేసుకున్నారు . సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఫ్రిస్కోలో ఉల్లాసంగా గుంటూరు ప్రవాసుల వనభోజనాలు


టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కోలో శనివారం నాడు గుంటూరు ప్రవాసుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజనాలు ఉల్లాసంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో ప్రొటెంమేయర్ షోన హుఫ్మం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రవాస తెలుగువారు అమెరికా సమాజంలో మమేకమై అమెరికా అభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు. పెద్దసంఖ్యలో ప్రవాసులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు రుచులను ప్రతిబింబించే వంటకాలతో ఏర్పాటు చేసిన విందు అలరించింది. స్థానిక చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వనభోజనాల్లో శ్రీనివాసరావు కొమ్మినేని, మురళి వెన్నం, శివ జాస్తి, పుల్లారావు మందడపు, ప్రవీణ్ కోడలి, శ్రీనివాస్ శాఖమూరి, నవీన్ యర్రమనేని, చిన్నపు రెడ్డి అల్లం, జగదీశ్ నల్లమోతు, చల్ల కొండ్రగుంట, శ్రీనివాస్ యలవర్తి, దీప్తి సూర్యదేవర, అను అడుసుమిల్లి, శ్రావణి, లక్ష్మి యలవర్తి, అనిల్ కుర్ర, పూర్ణ పురుగుళ్ళ, వెంకట్ తొట్టెంపూడి, సురేష్ గూడూరు, రవి కోటపాటి, వెంకట్ యలవర్తి, మహేష్ గోగినేని, చిరంజీవి కనగాల, నవీన్ సాంబ, రాజేంద్ర, ప్రేమ్, ప్రతాప్ రెడ్డి, పూర్ణ యలవర్తి, రంగ పెమ్మసాని తదితరులు పాల్గొన్నారు.