అభినవ కర్ణుడు-ప్రతి ఏడాది రూ.30లక్షలు విరాళాలు ఇస్తున్న ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావు-TNI ప్రత్యేకం

Mulpuri-FEవిద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంతరించుకున్నఆదర్శ వ్యక్తి డాక్టర్ మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్ద జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

జీవన ప్రస్థానం ఇది:
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 31 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ. 30 లక్షల రూపాయలకుపైగా ) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్ధులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 9 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Mulpuri-4

Mulpuri-5

బాల్యం-విద్యాభ్యాసం:
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో ఈసీఈ విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు:
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

అంతా మేధావులే:
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.
Mulpuri-6

ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత:
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.
Mulpuri-3ఫోటో రైటప్: 1994 జూన్ లో అన్నపూర్ణ స్టూడియోలో టాప్ హీరో చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎన్.టి.ఆర్, బాలయ్యలతో డాక్టర్.మూల్పూరి వెంకట్రావు

 

 

 

 

పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ:

* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.

* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.

ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం.

నరిశెట్టి ఇన్నయ్య ముచ్చట్లు-6:ఆమెరికాలో కాట్రగడ్డ బాలకృష్ణ

నరిసెట్టి ఇన్నయ్య
ప్రముఖ పాత్రికేయులు, మానవవాది, రచయిత
——-
భారతస్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో అనేకమంది భారతీయులు చదువుల కోసం ఇంగ్లండ్, ఐర్లండ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినవాళ్ళు చాలా తక్కువ. అందులో తెలుగువారు మరీ అరుదు. అలా వెళ్ళినవారిలో కాట్రగడ్డ బాలకృష్ణ (1898-1950) ఒకరు. ఆయన ఇంటూరు (గుంటూరు జిల్లా అమృతలూరు మండలం) గ్రామము నుండి వెళ్ళారు. తొలుత ఇంగ్లండులో లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ లో హెరాల్డ్ లాస్కీ వద్ద చదువుదామనుకున్నారు. కానీ, అక్కడి ఖర్చులు భరించే స్థితి లేక అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. రూపర్ట్ ఎమర్సన్ వద్ద పిహెచ్.డి. (1932-37) చేశారు. ఎమర్సన్ ఆసియా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలవారు.బాలకృష్ణ స్థానికంగా బోస్టన్ లో విద్యార్థి సంఘాల సమావేశాల్లో పాల్గొని, 1933 నుండి బోస్టన్ రచయితల సంఘానికి అధ్యక్షులయ్యారు. భారత స్వాతంత్ర పోరాటాన్ని గురించి వారికి వివరించేవారు. బ్రిటీషు వారి సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ద్రావిడ సాహిత్యంలో రాజకీయాల గురించి బాగా అధ్యయనం చేశారు. భారత జాతీయవాదాన్ని కూలంకషంగా పరిశీలించారు. బౌద్ధ సాహిత్యంలో రాజకీయ సామాజిక విషయాలను లోతుగా అవగాహన చేసుకున్నారు. పిహెచ్.డి. పూర్తి చేసిన తరవాత 1937లో ఇండియాకు తిరిగి వచ్చి బ్రిటిష్ వ్యతిరేక కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. దానివల్ల జైలుపాలయ్యారు. అప్పటికే జైళ్ళలో కాంగ్రెస్, సోషలిస్టు పార్టీలవారుండేవారు. ఎన్.జి.రంగా జైళ్ళలో రాజకీయ పాఠశాలలు పెట్టి డిటెన్యూలకు పాఠాలు చెప్పేవారు. రంగాకు వ్యతిరేకంగా కె.బి.కృష్ణ కమ్యూనిస్టు తరగతులు నడిపేవారు. జైలు నుండి విడుదలయిన తరువాత కె.బి.కృష్ణ కొద్ది కాలంపాటు బెల్గాం యూనిర్సిటీలో పనిచేశారు. కానీ క్షయ వ్యాధితో ఎక్కువ కాలం బతకలేదు. 1950 లో చనిపోయారు.హిందూ ముస్లిం సమస్యలపై, అల్పసంఖ్యాకుల విషయాలపై ఆయన రచనలు యునెస్కోవారు ఉత్తమమైనవిగా స్వీకరించారుకె.బి.కృష్ణ విషయాలు మరుగున పడిపోయాయి. బాపట్ల నుండి రవిచంద్ బాగా పట్టించుకుని ఆయన రచనలు అన్నీ వెలికి తెచ్చారు. 2000 సంవత్సరం ప్రాంతంలో నేను అమెరికాలో వుండగా మిత్రులు అమెరికా వచ్చి బాలకృష్ణ విషయాలు తెలుసుకోమని కోరారు. హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీ ద్వారా కొంతవరకు విషయ సేకరణ చెయ్యగలిగాను. కారణం తెలియదు గాని కమ్యూనిస్టులు బాలకృష్ణ విషయంలో ఉదాసీనత వహించారు. అమెరికాలో ఆనాడు బాలకృష్ణకు అరుదైన ఆదరణ హార్వర్డ్ లో లభించింది. ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు ఈ క్రింద చూడండి..
1. Studies in Hindu materialism by K. B Krishna ( Book ) 
3 editions published in 1994 in English and held by 31 WorldCat member libraries worldwide
2. Political and social thought of the Buddhist writers of the early Christian era : (a study of the movement of protest against caste system from the 2. century A.D. to the 5. century A.D.) by K. B Krishna ( Book ) 
1 edition published in 1960 in English and held by 1 WorldCat member library worldwide
Katragadda-Balakrishna-TNI

‘అభినవ కర్ణుడు’ – 40 కోట్లు విరాళాలిచ్చిన డా.హనిమిరెడ్డి

dr.hanimi reddy photoడా.హనిమిరెడ్డి ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలు పలు సంస్థలకు విరాళాలుగా అందజేశారు. సంపద కలిగిన వాళ్ళలో మిగిలిపోయిన దానిని దానం చేసే వాళ్ళని చూశాం, చందాలు వసూలు చేసి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని చూశాం. కానీ -తనకున్న దానిలో సింహభాగం దానధర్మాలకు వినియోగించే వాళ్ళను, దానం చేయడం కోసమే సంపాదించేవాళ్ళను చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తి  డా.హనిమిరెడ్డి. పుట్టిపెరిగిన సొంత ఊరును, సొంత రాష్ట్రాన్ని, సొంత దేశాన్ని మరిచిపోలేదు. అలాగని తనను అక్కున చేర్చుకొని ఆదరించిన అమెరికా దేశాన్ని నిర్లక్ష్యం చేయలేదు. తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి తాను సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన అమెరికాకు సమాన స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల నుండి ఆయన వైద్యుడిగా సంపాదించిన దాంట్లో అధికంగా దానధర్మాలకే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 మిలియన్ డాలర్లు (40 కోట్ల రూపాయిలు) వివిధ సంస్థలకు విరాళాలుగా అందజేశారు. తన స్వగ్రామం కృష్ణా జిల్లా వెల్వడంలో రూ.50 లక్షలతో తాను చదువుకున్న స్కూలుకు భవనాలు నిర్మించారు. పొరుగునే ఉన్న మైలవరంలో కోటి రూపాయిలతో హైస్కూలు భవనాలు నిర్మించారు. మైలవరంలో జాతీయ రహదారి పక్కనే ఆరు ఎకరాల స్థలాన్ని కొని సొంతంగా ఆధునిక సౌకర్యాలతో భవనాలను కట్టించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. దీని కోసం 10 కోట్ల రూపాయిలు వెచ్చించారు. తాను మెడిసన్ చదువుకున్న వరంగల్ మెడికల్ కాలేజీలో విద్యార్ధినుల కోసం 4 కోట్లతో లేడీస్ హాస్టలు, ఆడిటోరియంను నిర్మించారు. ఇది కాకుండా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ది కోసం కోటి రూపాయిలు విరాళాన్ని ఇచ్చారు. తాను పుట్టి పెరిగిన వెల్వడం గ్రామానికి ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చి అక్కడున్న పేదలకు అన్నదానంతో పాటు వందలాది మందికి నూతన వస్త్రాలు, కళ్ళజోళ్ళు బహుకరిస్తున్నారు. దీనితో పాటు చాలా మంది వృద్ధులకు, పేద విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేస్తున్నారు. అమెరికాలో తనకు జీవనాధారం కల్పించిన వివిధ సంస్థలకు భూరి విరాళాలను అందజేశారు. తాను నివాసం ఉంటున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని మర్సడ్ నగరంలో యూనివర్సిటీ, ఆడిటోరియం నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అక్కడ సైన్స్ సెంటర్ అభివృద్దికి మరో 4 కోట్లు విరాళాన్ని ఇచ్చారు. స్థానికంగా ఉన్న హైస్కూల్ నిర్మాణానికి దఫాల వారీగా విరాళాలను అందజేశారు. అమెరికాలో ఉన్న దాదాపు అన్ని తెలుగు సంస్థలకు, సాహితీ కార్యక్రమలకు సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రతి ఏడాది మొత్తంగా మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నారు.

చిన్నతనంలో గేదెలు కాశారు:

డా.హనిమిరెడ్డి జీవితంలో పలు ఆసక్తి కరమైన సంఘటనలు ఉన్నాయి,. 1942లో వెల్వడంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో ఆరుగురు సంతానంలో ఒకరిగా హనిమిరెడ్డి పుట్టారు. మైలవరంలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. 8వ తరగతి చదువుతున్న సమయంలో హనిమిరెడ్డి తల్లి చనిపోయారు. తర్వాత హనిమిరెడ్డి తండ్రి ఆయనకు పొలం పనులతో పాటు గేదెలను మేపే బాధ్యతలను అప్పగించారు. హనిమిరెడ్డికి చదువుపై ఆసక్తి పెరగడంతో హైస్కూల్ విద్యకు విజయవాడ తరలివెళ్ళారు. హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో పీ.యూ.సీ చదివారు. అప్పట్లో మంచి మార్కులు రావడంతో కాకతీయ మెడికల్ కళాశాలలో చేరి మెడికల్ సైన్స్ పూర్తిచేశారు. 1968 నుంచి 10 సంవత్సరాల పాటు మైలవరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు. అనంతరం అమెరికా వెళ్ళి కార్డియాలజిస్ట్ గా స్థిరపడి బాగా సంపాదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఆయనకు కలిసి వచ్చింది. డా.హనిమిరెడ్డి మంచి రైతు కూడా. అమెరికాలో దాదాపు 1500 ఎకరాల్లో జీడిపప్పు, బాదం, పిస్తా, ద్రాక్ష తదితర పంటలను పండిస్తూ మిలియన్ల డాలర్లను పంటల రూపంలో ఆర్జిస్తున్నారు. 76 ఏళ్ళ వయసులో ఇప్పటికీ చలాకీగానే ఉంటారు. పొట్టిలాగు వేసుకొని క్రమం తప్పకుండా రోజుకు 7కిలోమీటర్లు పరుగులు పెడతారు. అయన కుమారులు ఇరువురూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు డా. విక్రమ్ కార్డియాలజిస్ట్ గా డా.హనిమిరెడ్డి వద్దనే పని చేస్తున్నారు. చిన్న కుమారుడు సిద్దార్ధ రియల్ ఎస్టేట్, వ్యవసాయ పనులు చూస్తున్నారు. హనిమిరెడ్డి భార్య విజయలక్ష్మి భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. హనిమిరెడ్డి జీవితం నేటి యువతరానికి ఆదర్శం. హనిమిరెడ్డి గారిని సంప్రదించి వారికి మీ అభినందనలు తెలపాలంటే – ఈ-మెయిల్: hlakireddymd@yahoo.com

 

SAM_1553 SAM_1556 SAM_1527 IMG_0639 IMG_0643

నూతన రాజధానిలో ‘రవీంద్ర భారతి’ నిర్మాణానికి డాక్టర్ హనిమిరెడ్డి సంసిద్ధత

నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంగణంలో భారీ ఆడిటోరియం నిర్మాణానికి ప్రవాసాంధ్ర ప్రముఖుడు, ప్రముఖ దాత డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి సిద్దంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా చాలా రాష్ట్ర రాజధానుల్లో రవీంద్రనాధ్ ఠాగూర్ పేరు మీదగా భారీ ఆడిటోరియంలు ఉన్నాయి. హైదారాబాదులో అసెంబ్లీ, సచివాలయానికి మధ్య ప్రదేశంలో రవింద్ర భారతి ఉంది. ఇదే తరహాలో భారీ ఆడిటోరియం నిర్మించడానికి డాక్టర్ హనిమిరెడ్డి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం నూతన రాజధాని ప్రాంగణంలో నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సమీపంలో 6 ఎకరాల స్థలాన్ని ఈ ఆడిటోరియం నిర్మాణానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ హనిమి రెడ్డి కోరే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రవింద్ర భారతి తరహాలో భారీ ఆడిటోరియం నిర్మించాలంటే 15 నుండి 20 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఆడిటోరియం నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని ఆయనే భరించడానికి సిద్దంగా ఉన్నారు.

26న బాధ్యతలు చేపడుతున్న ఆనంద్

కుచిపూడి నాట్యారామం అధ్యక్షునిగా నియమితులైన ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వచ్చే 26వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నెల రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉన్న ఆనంద్ శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. కూచిపూడిలో నాట్యారామం నిర్మాణానికి సంబంధించి అమెరికాలో పలు ప్రముఖ ఆడిటోరియం నిర్మాణాలను పరిశీలించారు. న్యూయార్క్ లో నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ప్రపంచంలోనే అత్యున్నతమైన విధంగా కూచిపూడి నాట్యారామాన్ని నిర్మించడానికి ఆనంద్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. వచ్చే 26న హైదరాబాద్ లో ఆనంద్ నూతన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

anand

డా.కొర్రపాటి మధుకు కీలక పదవి

న్యూయార్క్ లో ఉంటున్న ప్రముఖ ప్రవాస తెలుగు వైద్యుడు డా.కొర్రపాటి మధు ప్రతిష్టాత్మకమైన పదవికి ఎంపికయ్యారు. ‘అమెరికన్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ లాంగ్ ఐలాండ్ ‘ సంస్థ అధ్యక్షుడిగా డా.కొర్రపాటి మధు నియమితులయ్యరు. ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజికవర్గానికి చెందిన వారు. “నాట్స్ ” బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా డా. మధు గతంలోనే ఎన్నికయ్యారు.madhu-korrapati

తెలుగు సాహితీ, సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

TLCA-2అమెరికా, భారత దేశాల్లో భారతీయ, తెలుగు సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ, ఆరోగ్య, యువత, క్రీడా, సామాజిక సేవా వంటి పలు కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న 44 ఏళ్ల తెలుగు సాహితీ, సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఫ్లషింగ్‌లోని హిందూ మందిరంలో కన్నుల పండువగా నిర్వహించారు. మూడు రాష్ట్రాల నుండి 600కు పైగా అతిధులు హాజరయిన ఈ వేడుకలు గణేష ప్రార్ధనతో ప్రారంభమయి, జానపద, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, మానస ఆచర్య, దొడ్డపనేణి నరేన్‌ల సంగీత ప్రదర్శన, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్‌ల హాస్య నాటికలు వంటి కార్యక్రమాలు అతిధులకు పండుగ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చాయి. ఇటీవల భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ఈ సందర్భంగా అధ్యక్షుడు వోలేటి రావు నేతృత్వంలోని సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఫ్లషింగ్ ఆసుపత్రి సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మండవ నాగేశ్వరరావు చేసిన అంధత్వ నిర్మూలన సేవా కార్యక్రమాలకు గానూ పాల్ హ్యారిస్ పురస్కారాన్ని రోటరీ క్లబ్ వారు అందించి సన్మానించారు. ప్రముఖ దర్శకుడు బాపుపై స్టాంపును విడుదల చేశారు. నూతన అధ్యక్షురాలిగా కుంచం రాజిను ఎన్నికల పర్యవేక్షణాధికారి డాక్టర్ మండవ నాగేశ్వరరావు ప్రకటించారు. మహిళా, ప్రవాస యువత, ఆరోగ్య భద్రతలే తన హయాంలో లక్ష్యాలుగా సంస్ధను ముందుకు నడిపిస్తానని రాజి తెలిపారు. అనంతరం 2015 నూతన ఉపాధ్యక్షుడు చల్లపల్లి సత్య, కార్యదర్శి గూడురు శ్రీనివాస్, కోశాధికారి తాపీ ధర్మారావు, సహాయ కార్యదర్శి చింతకుంట్ల అశోక్, సహాయ కోశాధికారిగా కుదరవల్లి బాబు, ఇతర కార్యవర్గ సభ్యులుగా ఎంజపురి జయప్రకాష్, డాక్టర్ జాస్తి జ్యోతి, రాసపుత్ర హరిశంకర్, తునుగుంట్ల శిరీష, వనమా రామా, కోయి ప్రసాద్‌లను సభకు రాజి పరిచయం చేశారు. 2014 కార్యవర్గ సభ్యులు చిల్లర మనోహర, మండవ లక్ష్మీల సేవలను నూతన కార్యవర్గం గుర్తించి ఘనంగా సన్మానించింది. సహాయ దర్శకుడు అరిగపూడి రమేష్ చంద్ ఈ వేడుకలకు అతిధిగా హాజరయ్యారు. చల్లపల్లి సత్య వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

TLCA-1 TLCA-3 TLCA-4

వార్త ఆంగ్ల మూలానికి ఇక్కడ చూడండి – English Version

నూతన రాజధానిలో ‘రవీంద్ర భారతి’ నిర్మాణానికి డాక్టర్ హనిమిరెడ్డి సంసిద్ధత – TNI ప్రత్యేకం

ravindra_bharatihlakireddy8x10

 

 

 

 

 

నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంగణంలో భారీ ఆడిటోరియం నిర్మాణానికి ప్రవాసాంధ్ర ప్రముఖుడు, ప్రముఖ దాత డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో సహా చాలా రాష్ట్ర రాజధానుల్లో రవీంద్రనాధ్ ఠాగూర్ పేరు మీదగా భారీ ఆడిటోరియంలు ఉన్నాయి. హైదారాబాదులో అసెంబ్లీ, సచివాలయానికి మధ్య ప్రదేశంలో రవింద్ర భారతి ఉంది. ఇదే తరహాలో భారీ ఆడిటోరియం నిర్మించడానికి డాక్టర్ హనిమిరెడ్డి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం నూతన రాజధాని ప్రాంగణంలో నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సమీపంలో 6 ఎకరాల స్థలాన్ని ఈ ఆడిటోరియం నిర్మాణానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ హనిమి రెడ్డి కోరే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రవింద్ర భారతి తరహాలో భారీ ఆడిటోరియం నిర్మించాలంటే 15 నుండి 20 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఆడిటోరియం నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని ఆయనే భరించడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. గత డిసెంబర్, జనవరి నెలలో ఆయన నెల రోజుల పాటు తన స్వస్థలమైన మైలవరంలో గడిపారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులో మాటను సన్నిహితుల వద్ద వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలవాలని డాక్టర్.హనిమిరెడ్డి ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల మూలంగా వీలుపడలేదు. ముఖ్యమంత్రి సోమవారం విజయవాడ వచ్చిన సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు. విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడిటోరియం నిర్మించే విధంగా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదన చేశారు. అయితే డా. హనిమి రెడ్డి మాత్రం నూతన రాజధాని ప్రాంతంలోనే ఆడిటోరియం నిర్మించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన తన సన్నిహితుల ద్వారా ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలియపరచనున్నట్లు సమాచారం.

నా లక్ష్యం అమెరికా సెనేట్

న్యూజెర్సీ మంత్రి చివుకుల ఉపేంద్ర ప్రస్థానం – టీ.ఎన్.ఐ ప్రత్యేకం

బడి ఎగ్గొట్టి పెన్నానది ఒడ్డున చేసిన షికార్లు, స్నేహితులతో కలిసి ఆడుకున్న దాగుడుమూతలూ… ట్రంకురోడ్డు పై చెక్కర్లు, నెల్లూరు నవాబుపేట సమీపంలోని అగ్రహారంలో గడిచిన అందమైన బాల్యం నాది.

TNI-Chivukula-1

నాకు ఊహ వచ్చే నాటికి మా నాన్న ఓ రైసె మిల్ లో గుమస్తాగా పని చేసేవారు. ఆయన మోసే భారం గురించి తెలియని వయసది. ఐదో తరగతి వరకు ఆడుతూ పాడుతూ అక్కడే చదివా . కాని అంతలోనే ఎదో తేడా తేలిసేది. బ్రతుకు భారమవుతున్నట్టు , ఇల్లు గడవటం కష్టమవుతోందని అర్ధమయ్యింది. ఆరుగురు పిల్లలం మరి. సంపాదన సరిపోకపోవడంతో మకాం మద్రాసుకు మార్చారు నాన్న . అప్పటిదాకా లోకం పోకడ తెలియని నాకు, మద్రాసు అదే ఇప్పటి చెన్నై ..ఎన్నో పాఠాలు నేర్పింది. జీవితంలో గెలవాలంటే చదువు ఎంత అవసరమో అక్కడే అర్ధమయ్యింది.

విద్యా పర్వం
మద్రాసు లోని హిందూ థియొలాజికల్ ఉన్నత పాఠశాలలో పదకొండో తరగతి దాకా చదివాన్నేను. ఆ తర్వాత వివేకానందా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రధమ శ్రేణి మార్కులతో పీ.యూ.సీ పాసయ్యాను. గొప్ప కళాశాలగా పేరుపొందిన గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. అప్పట్లో నా చదువు చాలా వరకు ఉపకారవేతనాల మీదనే సాగింది. నా శ్రద్ధ గమనించిన నాన్న కుడా చాలా కష్టపడి సహకరించేవాడు. ఎంత కష్టపడినా పెదాలపై చిరునవ్వు చెరగనిచ్చేవాడ్ని కాదు. చిన్నప్పటీలాగానే స్నేహితులతో తిరుగుళ్ళూ, షికార్లూ మామూలే. కాకపోతే ప్లేసు మారిందంతే ! పెన్నొడ్డూకు బదులు మెరినా బీచ్. అలాగని చదువు నిర్లక్ష్యం చేసింది లేదు. అందులో ఎప్పుడూ ఫస్టే .1972 నాటికి బీ.ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఇంజనీరయ్యాను.

ఉద్యోగ పర్వం
ఇంజనీరింగ్ పూర్తి అయిన రెండు నెలలకే ముంబై లోని బాబా ఆటమిక్ రీసర్చ్ సెంటర్ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. ఆశగా వెళ్ళాను. ఉద్యోగం మాత్రం రాలేదు. అంతలోనే నిరాశ. అక్కణ్ణుంచి తెరిగి చెన్నై వెళదామనే ఉంది…. కానీ అలా వెళ్ళి నాన్నకు భారం అవడం ఇష్టం లేకపోయింది. ఏదైతే అదే అయ్యిందని ఒక నిర్ణయానికొచ్చాను. ముంబైలోనే ఉండిపోయాను. చిన్నదా చితకదా అనే అలోచన లేకుండా ఏవేవో ఉద్యోగాలు చేశాను. సత్రం భోజనం, మఠం నిద్రలాగా పగలంతా ఉద్యోగం, రాత్రిపూట స్నేహితుల ఇళ్ళలో మకాం. అదిగో అక్కడే ఒక విలువైన జీవిత పాఠం నేర్చుకున్నాను. అదేంటంటే …..ఒక సారి ప్రయత్నించి విఫలమైనంత మాత్రాన డీలా పడిపోకూడదు. మనపని మనం చేసుకుంటూ పొతే తప్పక ఫలితం లబిస్తుందనేది ఆ పాఠం. నాకూ లభించింది… ఐ.ఒ.ఎన్ ఎక్సేంజ్ కంపెనీలో ఉద్యోగం రూపంలో నెలకు నాలుగొందల జీతం. జీవితంలో అదే నా తొలి గెలుపు!

విదేశీ పర్వం
ఒక ఇంజనీరుగా అప్పట్లో నాకు జర్మనీ వెళ్లాలని ఉండేది. ఎందుకంటే ఆ దేశం ఇంజనీర్ల స్వర్గం. ముంబాయి లోని మాక్స్ ముల్లర్ భవనంలో కొన్నాళ్ళు జర్మన్ భాష కూడా నేర్చుకున్నాను. అయితే నా మిత్రులేమో అమెరికా అయితేనే బెటర్ అని నా చెవిన ఇల్లు కట్టుకొని మరీ పోరేవారు. సరే, అక్కడికెళ్ళి పైచదువులు చదవాలని నిర్ణయించుకున్నాను. విదేశమంటే మధ్యలో వీసా పర్వ(త)o ఒకటి దాటాలి. కదా. అది నాకు రెండు సార్లడ్డొచింది. ‘నీకు అమెరికా వెళ్ళి చదివేంత స్థోమత లేదు’ అంటూ రెండుసార్లు వీసా నిరాకరించారు. కారణం – మన ఖాతాలో నిల్వ నిల్. అక్కడ చదువు కోవాలంటే మన అకౌంట్లో నిర్ణీత మొత్తం ఉండాలి. అప్పుడు డాలర్ కు మనకు ఎనిమిది రూపాయిలొచ్చేవి. అకౌంట్లో కనీసం నాలుగ వేల డాలర్లు అయినా ఉండాలి. అంటే అచ్చంగా 32 వేల రూపాయిలు. ఆశ వదిలేసుకున్నాను. ముచ్చటగా మూడోసారి ముందుకే అడుగేశాను. చెప్పాను కదా పట్టు వీడని ప్రయత్నానికి ఫలితం తప్పక లభిస్తుందని. మరోసారి రుజువైంది. నా విషయంలో ఈసారి గోపాల్ బయ్ దేశాయి (గుజరాత్) ఆదుకున్నారు. బ్యాంకు ఖాతాలో 32 వేల రూపంలో. డబ్బు అలా ఖాతాలో పడటమేంటి ఇలా వీసా నా చేతికొచ్చింది. 1974 మే… అవకాశాల స్వర్గంగా పేరుపొందిన అమెరికా గడ్డపై తొలి సారిగా అడుగుపెట్టాను.

ప్రణయ పర్వం
న్యూయార్క్ సిటీ కాలేజీలో ఎం.ఎస్ లో చేరాను. అప్పట్లో దరఖాస్తు రుసుము పది డాలర్లు. అంటే నాలెక్కల ప్రకారం రూ.80. రెండేళ్ళలో నా ఎం.ఎస్ పూర్తయ్యింది. ఆ తర్వాత సరిగ్గా ఏడాది తిరిగే సరికి అంటే 1976 జూన్ లో నా సహాధ్యాయి డైసీతో (తనది క్యూబా) పెళ్లయింది. చదువుకునేటప్పుడు ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారి పెళ్ళయ్యేసరికి మూడేళ్ళు పట్టింది. పెళ్ళయిన వెంటనే చెప్పలేదు కానీ కొన్నాళ్ళ తర్వాత ఇరువైపులా పెద్దవాళ్ళకు విషయం చెప్పాం. అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు వారికి.

రాజకీయ పర్వం
1981 నుంచి 1998 దాకా న్యూ జెర్సీలోని బెల్ లేబోరేటరీ లో ఇంజనీరింగ్ చేశాను. మరి రాజకీయ పర్వం అంటారా? 1993 లో మొదలైంది. పాలిటిక్స్ మీద ఆసక్తి తో 93 లో డెమక్రటిక్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాను. ఇండో అమెరికన్ ఫోరం ఫర్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో కీలక పాత్ర పోషించేవాడ్ని. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే రాజకీయ ఎదుగుదలకు నా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడ్ని. ఈ సారి ఫలితం లభించింది. డెమోక్రాటిక్ పార్టీ తరపున న్యూ జెర్సీ లోని ఫ్రాంక్లిన్ నగర కౌన్సిలర్ గా ఎన్నికయ్యాను. అది 1997. 1998 లో డిప్యూటీ మేయర్ ని. 2000 సంవత్సరంలో ఫ్రాంక్లిన్ నగర మేయర్ ని అయ్యాను. 2001 నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరమది. ఫ్రాంక్లిన్ నగరం నుంచే న్యూ జెర్సీ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యా. నాటి నుంచి నేటి దాకా ప్రతి రెండేళ్లకొకసారి ఇక్కడి ప్రజలు తమ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపుతూనే ఉన్నారు. 2007లో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా నన్ను వరించింది. అప్పటి నుండి సెప్టెంబర్ 2014 వరకు న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి లో ఉన్నా. మొత్తం 7 సార్లు అసెంబ్లీ కి ఎన్నికయ్యా. ఇటీవలే న్యూజెర్సీ రాష్ట్ర ప్రజావసరాల శాఖ మంత్రి గా(బి.పి.ఓ), కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించా . నాకు వ్యక్తిగతంగా లభించిన సంతృప్తి ఏమిటంటే నేను అసెంబ్లీ కి ఎన్నిక అవకముందు అక్కడ రిపబ్లికన్ల హవా నడిచేది. ఇప్పుడా చాన్స్ లేదు. ఆ పార్టీ ప్రస్థానానికి అడ్డుగా అక్కడ చివుకుల ఉపెంద్ర అనే స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్థాయి లో ప్రజాభిమానం సంపాదించుకున్నానన్నదే నా సంతృప్తి

కుటుంబ పర్వం
మా ఆవిడ డైసీ క్యూబా దేశస్థురాలు. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ చక్కటి భారతీయ పేర్లే పెట్టుకున్నాం. అబ్బాయి సూరజ్ వాషింగ్టన్ డిసీ లో అటార్నీ గా పని చేస్తున్నాడు. అమ్మాయి దమయంతి గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో శిక్షణపూర్తి చేసుకొని ప్రస్తుతం మాతోనే ఉంటుంది. అన్నట్టు మరో మాట డైసీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. నా కోసం నేర్చుకుంది. పిల్లలు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మన పండగల్ని సాంప్రదాయ పద్ధతి లో జరుపుకుంటాం.

భవిష్యత్ పర్వం
నెల్లూరులో ఎక్కడి అగ్రహారం, ఎక్కడి న్యూజెర్సీ అసెంబ్లీ? తల్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది. ఒక నిర్ణయం…ఒకే ఒక్క నిర్ణయం! ఆ రోజు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం రాలేదన్న బాధతో వెనక్కి వెళ్ళిపోయుంటే …! వెళ్ళకూడదని ఆ నాడు తీసుకున్న నిర్ణయమే ఈనాడు నన్ను ఇంతటి స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అమెరికా కేంద్ర సెనెట్ (మన పార్లమెంట్ లాగా). అన్నట్లు నేను పుట్టిన తేదీ చెప్పనే లేదు కదూ 1950 అక్టోబర్ 8. అరవైనాలుగు ఏళ్లలో సాధించిన విజయాలివి. ఇప్పుడు సగర్వంగా చెబుతున్నా. సెనెటర్ గా ఎన్నికవ్వాలన్న నా లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తాను. ఇదే నా భవిష్యత్ పర్వం.

TNI-Chivukula-2

 

తెలుగు ‘పద్మా’లకు నాట్స్ అభినందనలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురుకి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించటం పట్ల ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది.  కృష్ణా జిల్లాలో పుట్టి, కర్నూలులో వైద్య విద్యనభ్యసించి, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వైద్య రంగంలో విశేష అనుభవాన్ని, పేరు ప్రఖ్యాతలను గడించి, పేదవారికి తోడ్పాటును అందించటంలో ముందుండే డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి పురస్కారం రావటం చాలా ఆనందంగా ఉందని నాట్స్ బోర్డు చైర్మన్ డాక్టర్ కొర్రపాటి మధు అన్నారు. కోట శ్రీనివాసరావును నాట్స్ సభల్లో ముఖ్య అతిధిగా సత్కరించుకోవటం, ఆయనకి పద్మశ్రీ పురస్కారం రావటం గర్వంగా ఉందని నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరితో పాటు పద్మ పురస్కారాలు అందుకుంటున్న తెలుగు వారందరికీ నాట్స్ అభినందనలు తెలిపింది.

ఎన్నారై మెడికల్ కళాశాలలో ‘పుష్కర మహోత్సవాలు’ ప్రారంభం

DSC_7095గుంటూరు జిల్లా నూతన రాజధాని సమీపంలో ఉన్న ఎన్నారై మెడికల్ కళాశాల పుష్కర మహోత్సవం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు శనివారం నాడు ప్రారంభించారు. ఈ కళాశాల ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కళాశాల యాజమాన్యం పుష్కర మహోత్సవాలను నిర్వహిస్తొంది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గత 12 సం. నుండి మెడికల్ కళాశాల, ఆసుపత్రి సాధించిన అభివృద్ధిని ప్రశంసించారు. వైద్య వృత్తి పవిత్రమైందని, గ్రామీణప్రాంతాలకు వైద్య పరిశోధన ఫలితాలను, సేవలను విస్తరించాలని వైద్యులకు, విద్యార్ధులకు సూచించారు. కళాశాల పాలకవర్గ చైర్మన్ డా. ముక్కామల అప్పారావు మాట్లాడుతూ, గత 12 సం. నుండి ఎన్నారై మెడికల్ కళాశాల, ఆసుపత్రుల్లో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. సేవాభావంతో నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎన్నారై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. కిలారు బుచ్చిబాబు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. కోనేరు శ్రీధర్, అమెరికా నుండి వచ్చిన వైద్య ప్రముఖులు డా. మెవుస్, డా. పాల్, డా. జ్యోతి, డా. వీరగంధం రమేష్, డా. స్టివార్ట్,,  డా. హోవెన్, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డా. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.DSC_7223 DSC_7196 DSC_7167 DSC_7151 DSC_7143 DSC_7137 DSC_7129 DSC_7115 DSC_7212

 

హోప్ ఫర్ హ్యూమానిటీ అధ్యక్షుడిగా కొల్లా సుబ్బారావు

kolla-subbaraoఅమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తున్న తానా సంయుక్త కార్యదర్శి కొల్లా సుబ్బారావు ఇటీవల అదే రాష్ట్రంతో పాటు మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీలతో పాటు భారత్‌లో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే హోప్ ఫర్ హ్యూమానిటీ అనే సంస్ధకు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నదానం, ఉచిత విద్య, ప్లాస్టిక్ సర్జరీలు వంటి పలు సామాజిక సేవా రంగాల్లో ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయిలు వినియోగించామని, తన సారధ్యంలో సంస్ధను బలోపేతం చేయటంతో పాటు మరిన్ని రంగాలకు తమ సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని సుబ్బారావు తెలిపారు.

డాక్టర్ ముక్కామల భారీ విరాళం

dr-mukkamalaఅమెరికాలో తెలుగు ప్రముఖుడు , రాష్ట్రం లోని ఎన్. ఆర్.ఐ మెడికల్ కళాశాల చైర్మన్ , ప్రముఖ వైద్యులు డా. ముక్కామల అప్పారావు అమెరికాలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు భారీగా విరాళాలను అందిస్తున్నారు . వచ్చె జులై మొదటి వారం లో లాస్ ఏంజిల్స్ లో నిర్వహిస్తున్న “నాట్స్ ” మహా సభలకు డా.అప్పారవు లక్ష డాలర్లు భారీ విరాళాన్ని ప్రకటించారు. డా. అప్పారవు రాష్ట్రం లోనూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మంగళగిరి సమీపం లో అనాధ బాలల శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు . చిన్మయ మిషన్ సేవా కార్యక్రమాలలో చురుకు గా

పా ల్గొంటున్నారు . రాష్ట్రంలో పలు వ్యాపార సంస్థలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు . “ఎయిర్ కొస్తా , హోటల్ షరటాన్ (రాజమెండ్రి), ఆయుష్ హాస్పిటల్స్ (విజయవాడ), ఎన్.ఆర్.ఐ విద్యా సంస్థల”లో ఆయన ప్రధాన భాగస్వామి గా ఉన్నారు.