వాషింగ్టన్‌లో సందడిగా సంక్రాంతి సంబరాలు

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జి.డబ్యూ.టి.సి.ఎస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి హెర్నడన్ హైస్కూల్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. పాల పొంగళ్లు, రంగుల ముంగిళ్లు, ముద్దుగొలిపే గొబ్బిళ్లు – అనే నినాదంతో నిర్వహించిన ఈ సంబరాలు అందరి గుండెల్లో ఆనంద పరవళ్లు కలిగించాయి. ఈ సందర్భంగా ముగ్గులు, చదరంగం పోటీలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి సృష్టించాయి. ఈ సందర్భంగా తెలుగు సాంప్రదాయ వంటకాలతో నిర్వాహకులు అందించిన విందు భోజనం పసందుగా ఉంది. ఈ ఉత్సవాలకు భారీగా విరాళాన్ని అందజేసిన ఉప్పుటూరు రామ్ చౌదరి, బిందు దంపతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తానా కార్యదర్శి వేమన సతీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంఘం అధ్యక్షుడు గౌర్నేని రవి తదితరుల అధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

DSC_0358-cropDSC_0412-cropDSC_0061-crop

DSC_0251-cropDSC_0340-cropDSC_0609-crop

ఆస్ట్రేలియాలో తెలుగు క్యాలెండర్ విడుదల

calendar_australia1

 

 

 

 

 

 

 

ఆస్ట్రేలియాలోని సీడ్నీ నగరంలో ఎన్.ఆర్.ఐ టి.డీ.పీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సిడ్నీలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యారు.

calendar_australia2calendar_australia3

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉగాది వేడుకలు

unnamed

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉగాది వేడుకలు సందర్భంగా ప్రదర్శనలు ఇవ్వాలనుకునేవారు culturalchair@mana-tasc.org కు ఈ-మెయిల్ చేయాలని కార్యవర్గం ఓ ప్రకటనలో కోరింది.

మెంఫిస్ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మెంఫిస్ తెలుగు సమితి ఆధ్వర్యంలో కోలీఎర్విల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.  పారుపూడి కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సంబరాలకు సుమారు 600 పైగా  తెలుగు వారు సకుటుంబ  సమేతంగా తరలి వచ్చారు. రంగు రంగుల రంగవల్లులతో, ముత్యాల ముగ్గులతో , గొబ్బెమ్మలతో అలంకరింపబడిన వేడుక ప్రాంగణం సాంప్రదాయ వాతావరణాన్ని తలపించింది. అధ్యక్షుడు పారుపూడి కిరణ్ సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా సంస్ధ నిర్వహించిన చిత్రకళా, ముగ్గుల, రుచులు , పతంగులు, వ్యాస రచన , పద్యాల పోటీల్లో చిన్నారులు, పెద్దలు పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్నారు. ప్రవాస చిన్నారులపై భోగి పళ్ళ తో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జానపదం,కూచిపూడి, భరత నాట్యం, గొబ్బిళ్లు సంక్రాంతి గీతాలు, బృందావనమిది అందరిదీ మధుర గీతాలు, మృగరాజు గర్వభంగం, తీపి వీరు పాయసం, అనగనగా ఒక రాజు వంటి ప్రదర్శనలతో  అతిధులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మెంఫిస్ తెలుగు సమితి  కార్యవర్గ  సభ్యులు పారుపూడి కిరణ్ , ఘనుకోట శశిరాము, పాపన్నగారి రామ్ , దామరాజు పద్మ , పోసినశెట్టి శైలజ , బుట్టి హరీష్ , ముప్పాల ప్రభాకర్, పేరూరు స్రవంతి రెడ్డి, ఏదూరు పుల్లా రెడ్డి, నక్కా ప్రశాంతి, బయ్యన అనిల్, జాగర్లమూడి శరత్, చెన్రెడ్డి అశ్విని, కటికనేని వెంకట్, కోటేరు రాజ, తోట పూర్ణ  ధర్మకర్తలు పొలాస స్వామి , నరిసెట్టి వీరభద్రరావు, బెల్డే శేషు, కొట్ట సురేష్ ,తోట రాజ్  తదితరులు అతిధులకు ధన్యవాదాలు తెలపటంతో సంబరాలు ముగిశాయి.

 

 

ఘనంగా తామా సంక్రాంతి సంబరాలు

Screen shot 2015-01-24 at 10.39.07 AM Screen shot 2015-01-24 at 10.39.21 AMమెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో స్ధానిక నార్‌క్రాస్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన సభా వేదికపై సాయిబాబా దేవాలయ వ్యవస్ధాపకుడు సుంకర రంగారావు, పారామౌంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధ్యక్షుడు సజ్జా ప్రమోద్‌లు జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. తామా అధ్యక్షుడు మద్దినేని వినయ్ అతిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సంస్ధ భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు. సాంస్కృతిక కార్యదర్శి వెంకటపతి రాజు వ్యాఖ్యాత విజయలక్ష్మిని సభకు పరిచయం చేశారు. సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులు ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, ప్రవాస చిన్నారులు పాడిన జై చిరంజీవ, కని పెంచిన మా అమ్మ, తేనెల తేటల మాటలతో, చిన్ని చిన్ని ఆశ వంటి గీతాలు ఆహుతులను ముగ్ధులను చేశాయి.  డ్యాజ్లర్స్ గ్రూపు నృత్య ప్రదర్శన, సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీలు వంటి వాటిలో అందరూ ఉల్లాసంగా పాల్గొన్నారు. అట్లాంటా ఎన్.టి.ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అన్నగారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ప్రవాసాంధృలు పుష్పగుచ్చాలతో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం ముసునూరి సతీష్ ఎన్.టి.ఆర్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి ప్రసంగించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న మూడేళ్ల చిన్నారి సాయి చికిత్స కోసం నిధుల సేకరణ నిర్వహించారు. క్రీడా విభాగ కార్యదర్శి తాటికొండ మనోజ్ త్వరలో నిర్వహించబోయే క్రీడా పోటీల వివరాలను తెలిపారు. తామా ఉపాధ్యక్షుడు మీసాల వెంకట్ ఈ వేడుకల విజయవంతానికి సాయపడిన దాతలు పారామౌంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ యాజమాన్యానికి, స్వచ్చంద కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపడంతో వేడుకలు ముగిశాయి. Screen shot 2015-01-24 at 10.39.32 AM Screen shot 2015-01-24 at 10.39.44 AM

టాకా సంక్రాంతి సంబరాలు

TACA
Dear TACA member/well-wisher,

In an effort to keep up and continue our Telugu festivals and culture alive here in Canada for the future generations, TACA is organizing “Sankranthi Sambaralu”, and planned a variety of stage items like dances, songs, dramas etc with our own children. We cordially invite you all to come and celebrate the festival together with enthusiasm and merriment.

Date: Saturday 24-January-2015

Venue: Chinguacousy Secondary School, 1370 Williams Parkway, Brampton, ON, L6S 1V3

Time: 5:00 PM to 11:30 PM

Entry to Sankranthi Sambaralu is FREE to all Telugu people and TACA well wishers.
Win exciting prizes !

Rangoli is made to welcome, happiness and peace in life. As we do not have the opportunity to డ్రా
muggulu everyday in Canada, TACA is organizing rangoli competition (ముగ్గుల పోటీ).